వైఎస్సార్ తనయుడిగా వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ రెడ్డి.ప్రజల అభిమానాన్ని సంపాదించడంలో అనతికాలంలోనే సక్సెస్ అయ్యారు.
అధికారం వస్తుంది అనుకున్న సమయంలో పవన్ రూపంలో అది దూరం అయినా సరే చంద్రబాబు కి మాత్రం జగన్ కి వచ్చిన ఓటు బ్యాంక్ విషయంలో చెమటలు పట్టాయి అనేది వాస్తవం.పవన్ కనుకా లేకపోతే చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం మరోమారు పాదయాత్ర చేసి ఉండేవారేమో.
ఏపీలో రాజకీయాల్లో టెన్షన్ పడేది జగన్ కాదు చంద్రబాబు అనేది ప్రతీ ఒక్క విశ్లేషకుడికి తెలిసిన విషయమే.కానీ బాబు మాత్రం మేక పోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఒక విషయం ఏమిటి అంటే.
జగన్ మోహన్ రెడ్డి జెండా పీకేస్తున్నారు…ఇప్పటి వరకూ టిడిపి ఇచ్చిన షాకులకంటే కూడా అతిపెద్ద షాక్ ఇవ్వబోతోది అంటున్నారు.
అసలు ఏమిటి ఆ షాక్ అని చుస్తే.వైసీపి నుంచీ 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టిడిపి లోకి వెళ్తున్నారు.కానీ ఇక్కడ నవ్వు తెప్పించే విషయం ఏమిటి అంటే.ఆ పరిణామం వలన జగన్ కి లాస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే భారీగా నష్ట పోయేది మాత్రం చంద్రబాబు అనేది అక్షర సత్యం…ఇప్పటికే గిడ్డి విషయంలో ఏపీ ప్రజలు టిడిపి గడ్డి తింటోంది అంటూ మంది పడుతున్నారు.
జంప్ అయ్యే ప్రతీ ఎమ్మెల్యే గిడ్డి లానే చంద్రబాబు నుంచీ ఎదో ఒక హామీ పుచ్చుకుని వెళ్తున్నారు అని భావిస్తున్నారట.
అంతేనా ఇదే సమయంలో జగన్ ని వ్యతిరేకిస్తు వస్తున్నా సామాన్య ప్రజలు సైతం చంద్రబాబు ఆకర్ష.
గిడ్డి ద్వారా వికర్ష్ అవడంతో జగన్ మీద సానిభుతూ చూపిస్తూ.జగన్ పై అభిమానం పెంచుకున్తున్నారని టాక్.జగన్ మోహన్ రెడ్డి ఒక పక్క ప్రజా సమస్యల కోసం పాదయాత్రలు చేస్తుంటే ఎమ్మెలేలు టిడిపి లోకి జంప్ అవ్వడం ఆయా నియోజకవర్గ ప్రజలకి తీవ్రమైన కోపాన్ని కలుగచేస్తుండగా.మరో మారు అదే వ్యక్తీ రాజకీయాల్లో నిలబడితే దేంతో కోడతామో మాకు తెలియదు అంటూ ఫైర్ అవుతున్నారట ప్రజలు.
చంద్రబాబు టిడిపిలోకి లాక్కుంటున్న వారందరికీ జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వని వారే కావడం గమనార్హం.పోనీ చంద్రబాబు వారికి టికెట్స్ హామీ ఇస్తార అంటే అదీ లేదు.
కానీ వారికి నామినేటడ్ పదవుల అసలు వేరే వేరే ఆశలు చూపి.వైసీపి నుంచీ టిడిపి లోకి జంప్ చేయించి జగన్ ని రాజకీయంగా దెబ్బకొట్టాలనేది చంరబాబు వ్యూహం.
కానీ ఏపీ ప్రజలు జంపింగ్ ఎమ్మెలేలులాగా గొర్రెలు కాదు అనేది ముందు ముందు చంద్రబాబు కి తెలుస్తుంది…ఇక ఆటలో అరటిపండు పవన్ కళ్యాణ్ అంటున్నారు విశ్లేషకులు.ఎన్నికలు అవ్వగానే పవన్ సినిమాల వైపు మొగ్గు చూపుతారు అనేది వారి వాదన.
సో ప్రజలు ఇప్పటకే పవన్ కళ్యాణ్ ని లెక్కలోకి తీసుకోలేదు.ఈ పరిణామాల నేపధ్యంలో చుస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు వైసీపిని వీడి వెళ్ళినా సరే అది మైండ్ గేమ్ లో భాగం మాత్రమే అని ఇప్పుడు ఉన్న పరిస్థతిలో ఈ పరిణామాలు అన్నీ జగన కి అనూకూలంగా మారతాయి అని అంటున్నారు విశ్లేషకులు.
అధినేత జగన్ మోహన్ రెడ్డికి టైం అస్సలు బాలేదు అని అనిపిస్తోంది.ప్రజా సంకల్పయాత్ర పేరుతో మొదలు పెట్టిన పాదయాత్ర ఇప్పుడు వైసీపికి ప్లస్ అవుతోందా మైనస్ అవుతోందా అనేది అధినేత జగన్ కే క్లారిటీ లేకుండా పోయింది…ఇదిలా ఉంటే వైసీపి నుంచీ టిడిపిలోకి ఒక్కొక్కరుగా రావడం ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.
ఇదే సమయంలో చంద్రబాబు జగన్ ని కన్ఫ్యూజ్ చేస్తూ.పార్టీ మీద దృష్టి పెట్టకుండా చేస్తూ ఎమ్మెల్యేలని సైకిల్ ఎక్కిస్తున్నాడు చంద్రబాబు నాయుడు.అయితే ఇప్పుడు బాబు మరొక భారీ షాక్ జగన్ కి ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.
రాజకీయాల్లో కీలక సమయంలో కావాల్సింది మైండ్ గేమ్.
కరెక్ట్ గా మైండ్ గేమ్ ఆడితే ఎటువంటి పార్టీ అయినా సరే చతికల పదవాల్సిందే.ఇప్పుడు బాబు ఈ గేమ్ ఆడబోతున్నారట.
రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పుడు ఉన్న మెజారిటీల ప్రకారం తెలుగుదేశంకి రెండు , వై కా పాకి ఒక సీటు దక్కుతాయి అయితే తెలుగుదేశం మాత్రం ఆ ఒక్క సీటు కూడా వైకాపా కి దక్కకుండా చేయటానికి భారీ స్కెచ్ రెడీ చేసింది అని సమాచారం.ఇందులో భాగంగానే బాబు వేసిన స్కెచ్ రెడీగా ఉందని తెలుస్తోంది.
రాజ్య సభలో మరొక సీటు కావాలంటే మరో ముగ్గురు ఎమ్మెల్యేల బలం టిడిపికి అవసరం.అయితే ముగ్గురు కాకుండా ఏకంగా అయిదుగురు ఎమెల్యేలు సైకిల్ ఎక్కేందుకు బాబు భారీ స్కెచ్ వేశారని సమాచారం.
రాయలసీమ నుంచి ఇద్దరు కోస్తా నుంచి ఇద్దరు.ఉత్తరాంధ్ర నుంచి ఒకరు ఇప్పటికే సైకిల్ ఎక్కటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్న సమాచారం…బాబు వేసిన స్కెచ్ ప్రకారం ఈ ఐదుగురు టిడిపిలోకి చేరితే జగన్ కి కోలుకోలేని దెబ్బ తగిలినట్లే అని చెప్పారు.
మరి జగన్ ఈ భారీ షాక్ నుంచీ ఎలా తప్పించుకుంటాడో వేచి చూడాలి మరి.