కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

మహానటి కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈమె తన స్నేహితుడు ఆంటోని తట్టిల్( Antony Thattil ) అనే వ్యక్తిని వివాహం( Marriage ) చేసుకున్నారు దాదాపు 15 సంవత్సరాల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా తెలియచేయడంతో గోవాలో వీరి వివాహం హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

405 Hours Time Taken To Design Keerthy Suresh Wedding Saree , Keerthy Suresh, We

ఇక కీర్తి సురేష్ మన హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం మొదట వివాహం చేసుకున్నారు అనంతరం క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.అయితే ఈమె మన ఆచార వ్యవహారాలను పాటిస్తూ పట్టుచీరను ధరించి ఏడు వారాల నగలతో ఎంతో అందంగా ముస్తాబైనట్టు తెలుస్తుంది అయితే పెళ్లి కోసం కీర్తి సురేష్ కట్టిన చీరకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.కీర్తి సురేష్ తన పెళ్లి కోసం ప్రత్యేకంగా ఈ చీరను డిజైన్ చేయించారని తెలుస్తోంది.

405 Hours Time Taken To Design Keerthy Suresh Wedding Saree , Keerthy Suresh, We

కీర్తి సురేష్ పెళ్లి చీరను కాంచీపురంలో ప్రత్యేకంగా చేయించారని తెలుస్తోంది.స్వచ్ఛమైన బంగారు జెరీతో పొదిగిన ఈ చీర ఎంతో చూడచక్కగా ఉంది ఇక ఈ చీర తయారు చేయడం కోసం ఏకంగా 405 గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.  ఇక ఈ చీర కోసం కీర్తి సురేష్ కొన్ని లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈమె మాత్రమే కాకుండా తన భర్త వేసుకున్న పట్టు పంచ కూడా మేలిమి బంగారు జరీతో తయారు చేసినదని తెలుస్తుంది.ఇక ఈ పంచ కోసం కూడా 150 గంటల సమయం పట్టిందట.

Advertisement
405 Hours Time Taken To Design Keerthy Suresh Wedding Saree , Keerthy Suresh, We

ఆంటోని వస్త్రాలకు కూడా బంగారు లేసులను ఉపయోగించి స్పెషల్ గా తయారు చేయించారట.వీరిద్దరికి సంబంధించిన పెళ్లి బట్టలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు