వామ్మో 400 కోట్లా.. విజయ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ !

తలపతి విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆయన నుంచి సినిమా వస్తుందంటే తమిళనాడులో పండగ వాతావరణం కనిపిస్తుంది.

 400 Crore Business For Vijay Thalapathy Movie , Lokesh Kanakaraj, Vijay Thalapat-TeluguStop.com

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వారసుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.ఆ మూవీతో ఆశించినంతా విజయం సాధించలేదు.

ఇక ప్రస్తుతం లోకేశ్ కనకారాజ్ దర్శకత్వంలో ” లియో బ్లేడి స్వీట్ ” అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఈ మూవీపై తమిళనాట తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Telugu Thalapathyvijay-Gossips

ఎందుకంటే లోకేశ్ కనకారాజ్ గత చిత్రాలు అయిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి.అంతే కాకుండా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ను కూడా పరిచయం చేశాయి.అందులో భాగంగానే ఖైదీ, విక్రమ్ సినిమాల యొక్క ఇంటర్నల్ కనెక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

దాంతో ఎల్ సి యు లో వచ్చే నెక్స్ట్ మూవీ ఏంటి అనే చర్చ అందరిలోనూ జరుగుతున్నా నేపథ్యంలో విజయ్ తలపతి తో సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ లోకేశ్.అయితే విజయ్ తలపతి తో తీస్తున్న మూవీ ఎల్ సి యు లో భాగమేనా లేదా వేరే కథనా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

Telugu Thalapathyvijay-Gossips

అయితే ఆ మద్య ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ టిజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈ మూవీ కూడా ఎల్ సి యు లో భాగమే అని చెప్పకనే చెప్పింది.దీంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది.దాంతో ఈ మూవీ రిలీజ్ కు ముందే 400 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.ఇంకా మూవీ షూటింగ్ దశలో ఉండగానే ఈ రేంజ్ బిజెనెస్ జరుపుకోవడం తమిళ్ సినీ చరిత్రలోనే మొదటి సారి అని తెలుస్తోంది.

అయితే నిజమో కాదో తెలియదు గాని ఒకవేళ ఇదే గనుక నిజం అయితే రిలీజ్ కు ముందే 400 కోట్లు బిజినెస్ జరుపుకున్న మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించడం ఖాయం.మరి ఋలిజ్ కు ముందే ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న ” లియో ” మూవీ.

రిలీజ్ తరువాత ఇంకెన్ని సంచలనలు సృష్టిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube