అవును, ప్రపంచంలోని వంద అత్యుత్తమ విమానాశ్రయాలు లిస్టు( List of best airports )లో నిలవగా మన భారతదేశంలోని 4 విమానాశ్రయాలు అందులో ర్యాంక్ సాధించడం విశేషం.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్( Delhi, Mumbai, Bangalore, Hyderabad ).
ఇండియాతో పాటు దక్షిణాసియాలో అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయాలుగా గుర్తింపు దక్కించుకోవడం విశేషం.భారత్‌లో ఫ్లైట్ జర్నీ చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ఎయిర్ ఫేర్ ఛార్జీలు అందుబాటులో ఉండటం, చిన్న నగరాలకు కూడా కనెక్టివిటీ పెరగడంతో చాలామంది విమానాల్లో ప్రయాణించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఎయిర్‌పోర్ట్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.ఇప్పటికే సేవలందిస్తున్న కొన్ని పెద్ద విమానాశ్రయాలు, తాజాగా ప్రపంచ దేశాల్లోని బెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్ రివ్యూ, రేటింగ్ ఏజెన్సీ స్కైట్రాక్స్ ప్రకటించిన గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్( Global Airport Awards )లో భారత్‌కు చెందిన 4 ఎయిర్‌పోర్ట్స్ చోటు దక్కించుకున్నాయి.
స్కైట్రాక్ లెక్కల ప్రకారం.ఇండియాతో పాటు దక్షిణాసియాలో అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి.హైదరాబాద్‌లోని GMR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 63వ స్థానం దక్కించుకుంది.అదేవిధంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 65వ ర్యాంక్ సాధించింది.ఇక ప్రపంచంలో సింగపూర్‌లోని చాంగి ఎయిర్‌పోర్ట్.బెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచి రికార్డు సాధించింది.
చాంగి ఎయిర్‌పోర్ట్ ఏకంగా 12వ సారి ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డు పొందడం కొసమెరుపు.అదేవిధంగా ఖతార్‌లోని దోహాలో ఉన్న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెండో ర్యాంకు, టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్ట్ మూడో ర్యాంక్, సియోల్‌లోని ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నాలుగో ర్యాంక్ సాధించాయి.