జులై నెల నుంచి దేశమంతటా అతి భారీ వర్షాలు దంచికొడుతున్న సంగతి విదితమే.రాజధాని ఢిల్లీలో కూడా కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వర్షాల వల్ల యమునా నది( Yamuna River ) నిండుకుండలా మారింది.ఇందులోని జలచరాలు పెరిగిన నీటిమట్టం వల్ల పైకి తేలుకుంటూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఒక డాల్ఫిన్ ( Dolphin ) యమునా నదిలో కొట్టుకుంటూ వచ్చి తీరానికి సమీపంగా ఆగింది.అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారులు దీనిని గమనించారు.
వెంటనే దానిని పట్టుకున్నారు.అనంతరం దానిని కోసుకొని, వండుకొని తినేశారు.

ఈ దారుణమైన ఘటన గురించి తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.వెంటనే నలుగురు మత్స్యకారులపై( Fishermen ) కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.దాని ద్వారానే పోలీసులు ఈ సంఘటన గురించి తెలుసుకున్నారు.ఆపై ఫిర్యాదు నమోదు చేసి మత్స్యకారులలో ఒకరిని అరెస్టు చేశారు.ఈ ఘటన ఆదివారం జరిగగా, సోమవారం చైల్ ఫారెస్ట్ రేంజర్ రవీంద్రకుమార్ స్టేషన్‌కి వచ్చి దీనిపై కంప్లైంట్ ఇచ్చారు.

ఆ ఫిర్యాదు ప్రకారం, నసీర్‌పూర్ గ్రామానికి( Naseerpur Village ) చెందిన నలుగురు మత్స్యకారులు జులై 22న ఉదయం యమునా నదిలో చేపలు పడుతుండగా వారి వలలో డాల్ఫిన్ చిక్కింది.అనంతరం వారు దాన్ని భుజాలపై మోసుకుంటూ, ఒక ఇంటికి తీసుకెళ్లి వండుకొని తినేశారు.మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు.ఫారెస్ట్ రేంజర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం నిందితులైన రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాకుండా ఇప్పటికే రంజీత్ కుమార్‌ను కటకటాల వెనక్కి నెట్టారు.మిగిలిన మత్స్యకారులను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.







