ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు విడుదలకి సిద్ధమయితే చాలు, మీడియా రేంజ్ హీరోలు, చిన్న హీరోలు తమ సినిమాలని కనీసం ఓ వారు ముందు అయినా, ఓ వారం వెనక్కి అయినా తీసుకొచ్చేవారు.అది మినిమం భయం.
రెండువారాలు గ్యాప్ ఇస్తే ఇంకా మంచిది అనుకునేవారు.కాని ఇప్పుడు అలా భయపడటం లేదు.
ఈ ట్రెండ్ సెట్ చేసింది ఖచ్చితంగా శర్వానంద్ అని చెప్పాలి.సెలవులు అంటే కేవలం పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకే కాదు, జనాలని రంజింపజేసే సినిమా తీస్తే చాలు, ప్రేక్షకులు చూస్తారు అని ఒకటిసారి కాదు రెండు సార్లు కాదు, మూడు సార్లు నిరూపించాడు.
నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనలతో పోటిపడి ఎక్స్ ప్రెస్ రాజా, ఖైది నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో పోటిపడి శతమానంభవతి, ఇప్పుడు స్పైడర్, జై లవ కుశ సినిమాలతో పోటిపడి మహానుభావుడు.పెద్దవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా, తనకి రావాల్సిన కలెక్షన్లు వచ్చేస్తున్నాయి.
శర్వానంద్ ఇచ్చిన ధైర్యంతో మీడియం రేంజ్ హీరోలు, చిన్నహీరోలు అంతా పండగల మీద పడుతున్నారు.
వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు పోటిపడతారు అని అంతా ఆశపడ్డారు కాని భరత్ అనే నేను మార్చి లేదా ఏప్రిల్ కి వెళ్ళిపోతుంది.
ఇంకేం, పవన్ కళ్యాణ్ కి సోలో రిలీజ్ దొరుకుతుంది అనుకునేరు.ఓవైపు బాలకృష్ణ ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు చెప్పగా, కొత్తగా రవితేజ వచ్చి చేరాడు.
టచ్ చేసి చూడు సంక్రాంతికే వస్తుందట.ఈ మూడు సినిమాలు కాకుండా, రాజ్ తరుణ్ నటిస్తున్న రాజుగాడు, అలాగే అనుష్క – యూవీ క్రియేషన్స్ వారి భాగ్మతి కూడా సంక్రాంతికే వస్తున్నాయి.
ఈసారి సంక్రాంతి పోటిలో ఏకంగా 5 సినిమాలు ఉండొచ్చు.







