ఈమధ్య కాలంలో ఆడియన్స్ ఒక సినిమా ఆదరిస్తే వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోతున్నారు.భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ రీసెంట్ గా విడుదల అవుతున్న సినిమాలను చూస్తూ ఉంటే మన టాలీవుడ్ హీరోలు స్క్రిప్ట్ ఎంపిక విషయం లో ఏ రేంజ్ లో వెనకబడ్డారో అర్థం అవుతుంది.
రీసెంట్ గా విడుదలైన ‘ఎనిమల్’ ( Animal )చిత్రాన్ని చూసి మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు కుళ్ళుకుంటున్నారు.ఈ స్థాయి రన్ రీసెంట్ సమయం లో ఏ సినిమాకి కూడా దక్కలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన జైలర్, లియో,పఠాన్ మరియు జవాన్ చిత్రాలు వీకెండ్స్ లో, అలాగే ఏదైనా పండగ సమయం లో భారీ వసూళ్ళను రాబట్టాయి.కానీ వర్కింగ్ డేస్ లో వీకెండ్ రేంజ్ పెర్ఫార్మన్స్ ని ఒక్క సినిమా కూడా ఇవ్వలేకపోయింది.
కానీ ‘ఎనిమల్’ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా వీకెండ్ రేంజ్ వసూళ్లను రాబట్టడం అనేది ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక పోతే ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా హిందీ వెర్షన్ లో దాదాపుగా రోజుకి 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను యావరేజిగా వసూలు చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.తెలుగు లో ఈ చిత్రానికి రోజుకి రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తున్నాయి.అలా వారం రోజుల లోపే ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 50 కోట్ల రూపాయిల గ్రాస్, పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ప్రముఖ ఆన్లైన్ టికెట్ సేల్స్ పోర్టల్ ‘బుక్ మై షో’( Book My Show ) లో గంటకి 30 వేల టిక్కెట్లు యావరేజి గా అమ్ముడుపోతున్నాయి.ఇది మామూలు రేంజ్ ర్యాంపేజ్ కాదు.
సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘టైగర్ 3 ‘ చిత్రానికి మొదటి రోజు కూడా ఈ రేంజ్ ట్రెండింగ్ లేకపోవడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో ఒక మూడు రోజులు తుఫాన్ ప్రభావం వల్ల కొన్ని చోట్ల కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది.లేకుంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ వసూళ్ల ట్రెండ్ కొనసాగి ఉండేది.ఈరోజుతో ఈ చిత్రం అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటుతుంది.
ఇదే ఫ్లో ని కొనసాగిస్తూ పోతే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇది కాసేపు పక్కన పెడితే చాలా చోట్ల ఈరోజు విడుదలైన మన టాలీవుడ్ క్రేజీ హీరో నాని ‘హాయ్ నాన్న’ చిత్రం మొదటి రోజు వసూళ్ల కంటే ఎక్కువ వచ్చాయట.
దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు , ‘ఎనిమల్’ మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుంది అనేది.