2022 సంవత్సరంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు వీళ్లే!

2022 సంవత్సరం ముగింపుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.2022 సంవత్సరం ఎంతోమంది సెలబ్రిటీలకు తీపి జ్ఞాపకాలను మిగల్చగా కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం చేదు జ్ఞాపకాలను మిగల్చడం గమనార్హం.పలువురు ప్రముఖ సెలబ్రిటీలు ఈ ఏడాది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.ఈ ఏడాది పవిత్ర లోకేశ్ నరేష్ ఎన్నో వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.

 2022 Tollywood Controversies Naresh Pavitra Lokesh Chiranjeevi Garikapati Anasuy-TeluguStop.com

పవిత్ర కొన్నిరోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

చిరంజీవి గరికపాటి వివాదం ద్వారా చిరు, గరికపాటి వార్తల్లో నిలిచారు.

ఈ వివాదంలో ఎక్కువమంది గరికపాటినే తప్పుపట్టారు.తనపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ల విషయంలో అనసూయ సీరియస్ అయ్యారనే సంగతి తెలిసిందే.

ఆంటీ అని కామెంట్లు చేసిన వాళ్లపై అనసూయ సీరియస్ కావడం గమనార్హం.అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది.

ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీ కూడా వివాదంలో చిక్కుకుంది.ఈ సినిమా గ్రాఫిక్స్ పై చాలామంది విమర్శలు చేశారు.ఈ ఏడాది విడుదలైన లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ లను విచారించింది.మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం నెలరోజుల పాటు షూటింగ్ ల బంద్ కొనసాగింది.

రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ కూడా పలు వివాదాల్లో చిక్కుకుంది.

శేఖర్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు.నయనతార, విశ్వక్ సేన్, రష్మిక, ఆర్జీవీ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.బిగ్ బాస్ షో వల్ల నాగార్జున తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.2023 సంవత్సరంలో అయినా వివాదాలు లేకుండా సెలబ్రిటీల జీవితాలు సాఫీగా సాగాలని ఆయా సెలబ్రిటీల అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube