2022లో అత్యధికంగా ట్రోల్స్ కు గురయ్యిన టాలీవుడ్ మూవీలు ఇవే!

2022 ఏడాది మరొక వారం రోజుల్లో పూర్తి కాబోతుంది.కొత్త ఏడాదిని గ్రాండ్ గా ఆహ్వానించడం కోసం అంతా రెడీ అవుతున్నారు.

 2022 Most Trolled Telugu Movies , Acharya, Liger, Son Of India, Tollywood, Telug-TeluguStop.com

మరి ఈ ఏడాదిలో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యాయి.ప్రతీ వారం కూడా కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అయితే ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటే మరికొన్ని మాత్రం డిజాస్టర్స్ అయ్యాయి.వందల కోట్ల నష్టాలను తెచ్చిపెట్టాయి.

మరి ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ట్రోల్స్ ఎదుర్కున్న సినిమాలు కూడా ఉన్నాయి.అవి ఏంటో తెలుసా.

ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.

కానీ ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఎదుర్కొంది.సోషల్ మీడియాలో ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

మంచు మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు కూడా ట్రోల్స్ వచ్చాయి.ఈ సినిమా విఎఫ్ఎక్స్ మొదలుకుని అందులోని ప్రతీ సన్నివేశం గురించి నెట్టింట ట్రోల్స్ వచ్చాయి.

ఈ సినిమాకు మోహన్ బాబు కెరీర్ లోనే దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

Telugu Trolled Telugu, Acharya, Liger, Radheshyam, Ramarao Duty, Son India, Telu

లైగర్.ఈ సినిమాతో కోట్లు వసూళ్లు చేసి మరో బ్లాక్ బస్టర్ గా చేస్తారు అనుకున్నారు.ముందు నుండి ఈ సినిమా హైప్ చూసి అంతా అలానే అనుకున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.పురీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Telugu Trolled Telugu, Acharya, Liger, Radheshyam, Ramarao Duty, Son India, Telu

మాస్ రాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై కూడా సోషల్ మీడియాలో భారీ విమర్శలు వచ్చాయి.అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాపై కూడా ట్రోల్స్ వచ్చాయి.రామ్ చరణ్, చిరు కలిసి నటించిన ఈ సినిమాకు ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు.కొరటాల శివ మొదటిసారి ప్లాప్ ఎదుర్కొంది ఈ సినిమాతోనే.ఈ సినిమా వల్ల ఈయనపై కూడా భారీ ట్రోల్స్ వచ్చాయి.ఇక మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాపై కూడా దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా పెద్ద ఎత్తున విమర్శలకు గురి అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube