ప్రతి ఒక్కరూ ‘పందులే గుంపులుగా వస్తాయి… సింహం సింగిల్ గా వస్తుంది’ అన్న సినిమా డైలాగ్ ను వినే ఉంటారు.అదేంటి? ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే ఎవరికైనా అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది.ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఓ గుంపుగా ఏర్పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.ఒక్కరైనా ఆ ప్రత్యర్థి ఎంత బలవంతుడనేది.ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం చూస్తుంటే అది నిజమనిస్తుంది.ఆనాడు (2009) లో దివంగత నేత వైఎస్ఆర్ ను( YSR ) ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి మహా కూటమిగా ఏర్పాడ్డాయి.
అలాగే సినీ నటుడు ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ కూడా కాస్త దూకుడు కనబరిచేది.
వీరందరికీ పోటీగా నిలబడి వైఎస్ఆర్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) విజయకేతనం ఎగురవేసిందన్న సంగతి తెలిసిందే.
అంతేకాదు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు 33 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే కావడం విశేషం.అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 294 స్థానాలకు గానూ కాంగ్రెస్ 157 సీట్లు సాధించగా టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి 106 స్థానాలను గెలిచింది.
అలాగే ప్రజారాజ్యం 18 సీట్లు, ఇతరులు మరో 13 సీట్లు గెలిచారు.చివరకు అంతిమంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.సమర్థుడైన నాయకుడు ఎదురుగా ఉన్న సమయంలో వారికి ఎదురుగా ఎంతమంది కలిసొచ్చినా వారు నిలవలేరన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది.
సాధారణంగా చరిత్ర పునరావృతం అవుతుందని అంటూ ఉంటారు.గతంలో జరిగిన సన్నివేశాలు, సంఘటనలు రిపీట్ అవుతుంటాయి.ప్రస్తుతం ఏపీలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన( TDP Janasena ) పొత్తులో ఉన్నాయి.అటు బీజేపీని కూడా ఆ కూటమిలోకి తీసుకురావడానికి చంద్రబాబు,( Chandrababu Naidu ) పవన్ తో( Pawan Kalyan ) పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.
బీజేపీని( BJP ) కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు అవసరం అయితే కమ్యూనిస్టు పార్టీలను కూడా కలిపేసుకుంటారనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.అయితే జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.
మరోవైపు అధికార పార్టీగా ఉన్న వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) తాను చేసిన సంక్షేమం, అందించిన పథకాలను చూసి ఓటేయాలంటున్నారు.అంతేకాదు తనకు వేరే ఏ ఇతర పార్టీతో పొత్తు వద్దని, ప్రజలే మద్ధతుదారులని చెబుతున్నారు.అంతర్గత సర్వేలు, నివేదికలతో ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేస్తూ సమన్వయకర్తలను మారుస్తున్నారు.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన ఇంఛార్జులను మార్చారు.ఇంకా పలు మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఏపీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తున్న ప్రజలు మళ్లీ 2009 రిపీట్ అవుతుందని అంటున్నారట.ఆనాడు వైఎస్ఆర్ ప్రత్యర్థుల కూటమిపై విజయం సాధించినట్లుగానే ఇప్పుడు సింగిల్ గా బరిలో దిగుతున్న సీఎం జగన్ ప్రత్యర్థులపై ఘన విజయం సాధిస్తారని చెబుతున్నారు.
చిన్నారుల నుంచి ముదుసలి వరకు ప్రతి ఒక్కరికీ అండగా నిలవడంతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన జగనన్నను మరోసారి గెలిపించేందు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.