చాట్ జిపిటి4 వలన 20 కేటగిరిలో ఉద్యోగస్తులు గల్లంతు కానున్నారట?

అవుననే అనిపిస్తోంది.గత కొంతకాలంగా ఇంటర్నెట్ ప్రపంచంలో విరివిగా వినబడుతున్న పేరు చాట్ జిపిటి( Chat gpt ).

 20 Categories Of Employees Will Be Lost Due To Chat Gpt4,chatgpt, Google, Apple,-TeluguStop.com

ఇక చాట్ జిపిటి తాజాగా చాట్ జిపిటి4( Chat GPT4 ) అప్డేట్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసినదే కదా.అయితే తాజా సర్వేల ద్వారా తెలిసినది ఏమంటే చాట్ జిపిటి4 దాదాపుగా 20 కేటగిరిలో ఉద్యోగాలను మటాష్ చేస్తాయని ఊహిస్తున్నారు.ఇక చాట్ జీపీటీ యొక్క ఈ కొత్త వెర్షన్ వస్తూ వస్తూనే చిచ్చుపెట్టే పనిలో పడింది.ఈ కొత్త వెర్షన్ మరింత ఖచ్చితత్వంతో ఉంటుందని, ఇది చాలా కేటగిరీలలో ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయం అని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే ఆయా ఉద్యోగాలు ఇపుడు ఈ ఏఐ ప్లాట్ఫామ్( AI platform ) చేయబోతోందన్నమాట.అందుకే, దీనిపైన వ్యాపార దిగ్గజాలు ఏమనుకుంటున్నాయో తెలుసుకునేందుకు ఒక సర్వే నిర్వహించగా అందులో మెజారిటీ పీపుల్ చాట్ జిపిటి4 కి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా చాట్ జిపిటి4 రీప్లేస్ చెయ్యగలిగిన జాబ్స్ ఏవని చాట్ జిపిటి4ని అడిగితే, అది వెంటనే 20 జాబ్స్ లిస్ట్ ను కూడా డిస్ప్లే చేయడం కొసమెరుపు.ఈ లిస్ట్ ను ఈ క్రింద చూడవచ్చు.

20 జాబ్స్ లిస్ట్ ఇదే:

1.కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ 2.కంటెంట్ రైటర్ 3.ట్రాన్స్ లేటర్ 4.డేటా ఎంట్రీ క్లర్క్ 5.సోషల్ మీడియా మేనేజర్ 6.వర్చ్యువల్ అసిస్టెంట్ 7.టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ 8.కాపీ ఎడిటర్ 9.పర్సనల్ అసిస్టెంట్ 10.స్పీచ్ రైటర్ 11.బ్లాగర్ 12.రీసెర్చ్ అనలిస్ట్ 13.ప్రూఫ్ రీడర్ 14.క్రియేటివ్ రైటర్ 15.ట్రావెల్ ఏజెంట్ 16.సేల్స్ అసోసియేట్ 17.లీగల్ రీసెర్చెర్ 18.హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్ 19.మార్కెటింగ్ అనలిస్ట్ 20.కాల్ సెంటర్ రిప్రెసెంటేటివ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube