విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోలు పంజా విసిరారు.ఎన్నికల ముందు గిరిజన ప్రాంతాల ప్రజలని భయబ్రాంతులకి గురి చేసే ప్రయత్నంలో భాగంగా మావోలు రంగంలోకి దిగారని సమాచారం అందుకున్న గ్రే హౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
అయితే విశాఖ ఏజెన్సీలో ఓ ప్రాంతంలో మావోయిస్టులు మాటు వేసి ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఎదురు కాల్పులు చేసినట్లు తెలుస్తుంది.
దీంతో మావోల కాల్పులని తిప్పి కొట్టడానికి పోలీసులు కూడా తిరిగి ఎదురుకాల్పులు మొదలెట్టారు.
ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతం అయినట్లు తెలుస్తుంది.ఇంకా 20 మంది వరకు మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం.
ఇక మావోయిస్టుల మాటు వేసిన స్థలంగా అధిక సంఖ్యలో నాటు తుపాకులు కూడా లభ్యం అయినట్లు తెలుస్తుంది.ఇక ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కి కూడా గాయాలు అయినట్లు తెలుస్తుంది.
అయితే ఈ ఎన్ కౌంటర్ పై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.మావోయిస్టులు అయితే నాటు తుపాకులు ఎందుకు ఉంటాయని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో వాస్తవాలు బయటకి తీయాలని కొరుకుతున్నారు.







