కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడి : ఆరుగురి అరెస్ట్, వారిలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు

కెనడా ( Canada )చరిత్రలోనే అతిపెద్ద చోరీగా నిలిచిన గతేదాది టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో లక్షలాది డాలర్ల విలువైన బంగారం దోపిడీకి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులను అరెస్ట్ చేశారు.ఈ కేసులో మరో ముగ్గురికి కూడా కెనడా అధికారులు వారెంట్లు జారీ చేసినట్లు పీల్ రీజినల్ పోలీసులు( Peel Regional Police ) (పీఆర్పీ) తెలిపారు.

 2 Indian-origin Men Among 6 Arrested In Canada's Biggest-ever Heist , Peel Regio-TeluguStop.com

ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీని మోసుకెళ్లే ఎయిర్‌కార్గో కంటైనర్‌లో నకిలీ పత్రాలను ఉపయోగించి సురక్షిత నిల్వ సౌకర్యం నుంచి దొంగిలించబడిందని పోలీసులు తెలిపారు.స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీలు వచ్చాయి.

Telugu Indianorigin, Aircargo, Ali Raza, Amit Jalota, Archit Grover, Canada, Par

ఇద్దరు ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగులు ఈ దొంగతనంలో సహాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం ఒకరు కస్టడీలో వుండగా.మరొకరికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిద్ధూ (54), అమిత్ జలోటా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసాత్ పరమలింగం (35)ను బుధవారం అరెస్ట్ చేశారు.

బ్రాంప్టన్‌కు చెందిన 25 ఏళ్ల డ్యూరాంటే కింగ్ మెక్లీన్ ప్రస్తుతం అమెరికాలో ఆయుధాల అక్రమ రవాణా సంబంధిత ఆరోపణలపై నిర్బంధంలో వున్నాడు.దర్యాప్తు అధికారులు అతనితో , అతని న్యాయవాదులతో టచ్‌లో వున్నారు.

Telugu Indianorigin, Aircargo, Ali Raza, Amit Jalota, Archit Grover, Canada, Par

గతేడాది నమోదైన నేరంపై సుదీర్ఘ విచారణ అనంతరం కెనడా అధికారులు ఈ అరెస్ట్ వివరాలను ప్రకటించారు.నేరం జరిగిన సమయంలో సిద్ధూ ఎయిర్ కెనడాలో పనిచేస్తున్నాడు.దొంగతనం జరిగిన సమయంలో ఎయిర్ కెనడా ఉద్యోగి అయిన బ్రాంప్టన్‌కు చెందిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్( Simran Preet Panesar ) (31) కోసం పోలీసులు కెనడావ్యాప్తంగా వారెంట్లు జారీ చేశారు.బ్రాంప్టన్‌కు చెందిన అర్చిత్ గ్రోవర్ ( Archit Grover ) (36), మిస్సిసాగాకు చెందిన 42 ఏళ్ల అర్సాలాన్ చౌదరి పేర్లను కూడా నివేదికలో ప్రకటించారు.

ఎయిర్ కెనడా ప్రతినిధి పీటర్ ఫిట్జ్ పాట్రిక్‌లు సిద్ధూ, పనేసర్‌లు ఉద్యోగులేనని ధ్రువీకరించారు.ఏప్రిల్ 17, 2023న మధ్యాహ్నం 3.56 గంటలకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం ల్యాండ్ అయయింది.6600 బార్‌ల 9999 శాతం స్వచ్ఛమైన బంగారం 400 కిలోగ్రాములు.20 మిలియన్ కెనడా డాలర్లు, 5 మిలియన్ల విదేశీ కరెన్సీని ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube