యూకే : ప్రతిష్టాత్మక ‘‘గ్లోబల్ నర్సింగ్ అవార్డ్’’ రేసులో ఇద్దరు భారతీయ నర్సులు..!!

ఇద్దరు భారతీయ నర్సులు ప్రతిష్టాత్మక ‘‘గ్లోబల్ నర్సింగ్ అవార్డ్’’( Global Nursing Award )కు షార్ట్ లిస్ట్ అయ్యారు.దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది.

 2 Indian Nurses Shortlisted For Global Nursing Award , Global Nursing Award, 2 I-TeluguStop.com

దీని కింద 2,50,000 అమెరికన్ డాలర్ల రివార్డును అందజేస్తారు.ఈ అవార్డ్‌కు పోటీపడుతున్న వారిని శాంతి థెరెసా లక్రా( Shanti Theresa Lakra ), జెన్సీ జెర్రీలుగా గుర్తించారు.

అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ప్రమాదకరమైన వారిగా పరిగణించే గిరిజన జాతులతో శాంతి పనిచేస్తున్నారు.ఇక కేరళ మూలాలున్న ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి జెన్సీ జెర్రీ.

వీరిద్దరూ ఈ అవార్డ్ కోసం షార్ట్ లిస్ట్ అయిన పది మంది జాబితాలో నిలిచారు.పబ్లిక్ ఓటింగ్ అనంతరం జ్యూరీ విజేతలను ప్రకటించనుంది.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మే 12న లండన్‌లో జరిగే వేడుకలో విజేతకు ప్రదానం చేస్తారు.

Telugu Indian Nurses, Indiannurses, Award, Jency Jerry, Shantitheresa-Telugu NRI

శాంతి థెరిస్సా లక్రా.పోర్ట్‌బ్లెయిర్‌లోని జీబీ పంత్( GB Panth in Portblair ) హాస్పిటల్‌లో పదేళ్లుగా నర్సింగ్ సేవలు నిర్వర్తిస్తున్నారు.అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని అత్యంత ప్రమాదకర ఆదిమ తెగలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు.ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది.2004లో సునామీ విరుచుకుపడినప్పుడు … ఇక్కడి ఒంగీ ద్వీపంలోకి నీరు చొచ్చుకురావడంతో పాటు అడవి నాశనమైంది.ఈ క్రమంలో శాంతి అక్కడి తెగలతో కలిసి సహాయక కార్యక్రమాలు చేయడంతో పాటు గుడారంలో నివసించింది.ఇప్పుడు ఆమె అండమాన్ దీవుల్లోని అన్ని ప్రధాన తెగల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆమె పేరు గ్లోబల్ అవార్డ్ కమిటీ దాకా వెళ్లింది.

Telugu Indian Nurses, Indiannurses, Award, Jency Jerry, Shantitheresa-Telugu NRI

ఇక మరో నర్సు జెన్సీ జెర్రీ( Jency Jerry ).ఈమె డబ్లిన్‌లోని మేటర్ మిసెరికార్డియే యూనవర్సిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు.ఇన్‌ఫెక్షన్ నియంత్రణకు సంబంధించి నర్సింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆమె పనిచేస్తున్నారు.

ప్రయోగశాలల నుంచి ఫలితాలను క్రోడీకరించేటప్పుడు మానవ తప్పిదాలను తగ్గించడానికి జెన్సీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.ఈ క్రమంలోనే గ్లోబల్ నర్సింగ్‌ అవార్డ్స్‌లో ఆమె షార్ట్ లిస్ట్‌ అయ్యారు.

వీరిద్దరితో పాటు ఇంగ్లాండ్, యూఏఈ, కెన్యా, టాంజానియా, పనామా, సింగపూర్, పోర్చుగల్, ఫిలిప్పీన్స్‌లకు చెందిన నర్సులు గ్లోబల్ అవార్డ్స్ ఫర్ నర్సింగ్ ఫైనలిస్టులుగా వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube