2017-2018లో 2.83 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

2016 నాటికి కేంద్ర ప్రభుత్వం కోసం 32.84 లక్షలమంది పనిచేస్తున్నారు.2018 నాటికి ఈ సంఖ్యను 35.

67 లక్షలకు చేర్చాలని ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.ఇందులో భాగంగానే 2.83 లక్షల కొత్త ఉద్యోగాలని అందించబోతోంది.ఈ కొత్త ఉద్యోగాల్లో 1.06.లక్షల ఉద్యోగాలు పోలీసు డిపార్టుమెంటువే కావడం విశేషం.దీంతో పోలీసు ఉద్యోగాల కౌంట్ మొత్తం మీద 11,13,689 గా మారనుంది.

విదేశి వ్యవహారాల శాఖలోకి 2,109 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.సివిల్ ఏవియేషన్ లో 1,045 కొత్త ఉద్యోగాలు ఇస్తారు, అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ లో 20,442 ఖాలీలు పూర్తి చేస్తారట.

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ లో 9,481 కొత్త ఉద్యోగాలు పుడుతున్నాయి.ఇక డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ లో మరో 3,068 ఉద్యోగాలు రాబోతున్నాయి.

నదీ జలాల శాఖకి సంబంధించి 3,632 కొత్త ఉద్యోగాలు వస్తాయి.పర్సనల్ మినిస్ట్రీలోకి 2,367 కొత్త ఉద్యోగాలు ఉంటాయి.

Advertisement

ఇక మైన్స్ మినిస్ట్రీకి సంబంధించి మరో 1,351 నూతన ఉద్యోగాలు వస్తాయి.హోమ్ మినిస్ట్రీ సంబంధించిన శాఖల్లో 6,076 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.

నోటిఫికేషన్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరో రాయి వేయండి.సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం అంటే చిన్న విషయం కాదుగా.

నోట్ : ఈ లెక్కలన్ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విడుదల చేసినవి.ఇందులోని తప్పులకి మాది బాధ్యత కాదు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు