వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కెనడాకు( Canada ) వెళ్లిన పలువురు భారతీయులు అక్కడ ఉన్నత స్థానానికి చేరుకుని ఇరుదేశాలకు గర్వకారణంగా నిలుస్తుంటే… కొందరు క్రైమ్ వరల్డ్ వైపు అడుగులు వేసి నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు.వీరిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ.
లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.తాజాగా ఆర్గనైజ్డ్ కార్గో థెఫ్ట్ రింగ్‌ను( Organized Cargo Theft Ring ) నడుపుతున్నారనే అభియోగాలపై 15 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి 9 మిలియన్ కెనడియన్ డాలర్లకు పైగా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఇవన్నీ దొంగిలించబడినవే కావడం గమనార్హం.
పీల్ మునిసిపాలిటీ అండ్ గ్రేటర్ టొరంటో ఏరియాలో జరిగిన వరుస ట్రాక్టర్ ట్రైలర్, కార్గో దొంగతనాలపై( Tractor-Trailer and Cargo Thefts ) దర్యాప్తు చేయడానికి ఈ ఏడాది మార్చిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో కెనడాలోని వివిధ నగరాలకు చెందిన 15 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.బాల్కర్ సింగ్,( Balkar Singh ) అజయ్,( Ajay ) మంజీత్ పెద్దా, జగ్జీవన్ సింగ్, అమన్‌దీప్ బైద్వాన్, కరమ్‌షాంద్ సింగ్, జస్వీందర్ అత్వాల్, లఖ్వీర్ సింగ్, జగ్‌పాల్, ఉపకారన్ సంధు, సుఖ్‌విందర్, కుల్వీర్ బెయిన్స్, బనీషిదర్ లాల్ సరణ్, శోబిత్ వర్మ , సుఖ్నీందర్ ధిల్లాన్‌లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.వీరంతా 22 నుంచి 45 సంవత్సరాల వయసు గలవారే.
వీరందరిపై దాదాపు 73 అభియోగాలను నమోదు చేశారు పోలీసులు.
దొంగిలించబడిన వస్తువుల్లో వాణిజ్య వస్తువులు, ఏటీవీలు, వాహనాలు వున్నాయని పోలీసులు తెలిపారు.నిందితులు వీటిని ఫ్లీ మార్కెట్‌లు, దుకాణాలలో విక్రయించినట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ (సీబీసీ)( Canadian Broadcasting Corporation ) నివేదించింది.ఈ గ్యాంగ్ జీటీఏ ఏరియాలోని ఆరు ప్రదేశాల్లో కార్గోలను, 28 ట్రాక్టర్ ట్రైలర్లను లక్ష్యం గా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
కంచెను కట్ చేసి లోపలికి ప్రవేశించి వస్తువులను దొంగిలించేవారని పేర్కొన్నారు.అరెస్ట్ వారిలో చాలా మందికి నేర చరిత్ర వుందని పీల్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిప్యూటీ చీఫ్ నిక్ మిలినోవిచ్ తెలిపారు.