నరసరావుపేటలో 144 సెక్షన్‌ ఎందుకు?

గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ అయిన కోడెల శివప్రసాదరావు మృతితో ఆయన సొంత ప్రాంతం అయిన నరసరావు పేటలో విషాదచాయలు అలుముకున్నాయి.హైదరాబాద్‌లో మృతి చెందిన కోడెలను ఆయన సొంత ప్రాంతంకు తీసుకు వెళ్లారు.

 144 Section In Narasaraopeta-TeluguStop.com

రేపు అక్కడ ఆయనకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి.

అయితే నరసరావుపేటలో 144 సెక్షన్‌ విధించడంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోడెల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తెలుగు దేశం కార్యకర్తలు మరియు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రావాలని, ఆయన్ను కడసారి చూడాలని ఆశ పడుతున్నారు.

కాని ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు పాల్పడుతూ 144 సెక్షన్‌ విధించినట్లుగా బాబు విమర్శించాడు.ఒక వైపు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు చేయడం మరో వైపు నరసరావు పేటలో 144 సెక్షన్‌ పెట్టడం అనేది రాజకీయం అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube