గత వారం ‘ఊపిరి’ చిత్రం విడుదల అవ్వడంతో ఆ చిత్రానికి పోటీగా చిన్న చిత్రాలు ఏవీ కూడా విడుదల అవ్వలేదు.ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ వారం(ఏప్రిల్ 1) ప్రేక్షకుల ముందుకు పెద్ద చిత్రాలు రావడం లేదు.దాంతో ఏకంగా 14 చిన్న చిత్రాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగులో ఒకే సారి ఇన్ని చిత్రాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇందులో డైరెక్ట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.డైరెక్ట్ చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న చిత్రాలు ‘సావిత్రి’, ‘ఎటాక్’.ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల కన్ను ఉంది.నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘సావిత్రి’ చిత్రం ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి.దాంతో చిత్రం కూడా ఆకట్టుకోవడం ఖాయం అని అంతా అంటున్నారు.
ఇక వివాదాల దర్శకుడు వర్మ, మంచు మనోజ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎటాక్’ చిత్రం చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వచ్చి, ఈవారం అంటే ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రాలతో పాటు ‘రాజాధిరాజ’, ‘పిడుగు’, ‘7 టు 4’, ‘మాస్’, ‘అప్పుడలా ఇప్పుడిలా’, ‘నన్ను వదిలి నీవు పోలేవులే’, ‘ఓ మల్లి’, ‘ఆమె ఎవరు’తో పాటు ఇంకా పలు చిన్నా చితక చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
మరి ఈ చిత్రాల్లో ఏ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.







