ఢిల్లీలో రేపు పద్నాలుగు మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు కొత్త సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఈ క్రమంలో వైసీపీ మరియు బీఆర్ఎస్ సభ్యులు రేపు రాజ్యసభ మెంబర్స్ గా ప్రమాణం చేయనున్నారు.ఏపీ నుంచి గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా.
తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేయనున్నారు.అదేవిధంగా ఒడిశా నుంచి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.