దేశంలో కొత్తగా ఎంపికైన రాజ్యసభ సభ్యులు( Rajya Sabha candidates ) ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు 14 మంది కొత్త సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఏపీ నుంచి వైసీపీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర( Vaddiraju Ravichandra ) ఎన్నికయ్యారు.అదేవిధంగా రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ( Sonia Gandhi ), ఒడిశా నుంచి అశ్వని వైష్ణవ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.