హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరానికి సమీపంలో తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.ఇవాళ అంబేద్కర్ జయంతి వేడుకను పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
బౌద్ధ మత గురువులు ప్రార్థనలు నిర్వహిస్తుండగా రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం జాతికి అంకితం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశ్ అంబేద్కర్ హాజరైన సంగతి తెలిసిందే.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో హెలికాప్టర ద్వారా పూలవర్షం కురిపించారు.







