జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న స్టార్ హీరో ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు.
అయితే ధనుష్ అక్కడే ఉండిపోకుండా ఇటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడు తున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమా పట్టాలెక్కక ముందే మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఈ రెండు సినిమాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటాడో లేదో చూడాలి.

అలాగే ధనుష్ పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇది పక్కన పెడితే తాజాగా ధనుష్ మరొక కొత్త సినిమా ప్రకటించాడు.ఇది ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతుంది.
ధనుష్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోనున్న ఈ సినిమాకు ధనుష్ నే దర్శకత్వం వహించనున్నాడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పీరియాడిక్ జోనర్ లోనే తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ధనుష్ దర్శకత్వం మీద నమ్మకం ఉంచి ఏకంగా 100 కోట్లు పెడుతున్నారు అంటే గ్రేట్ అనే చెప్పాలి.
చూడాలి ఈయన మైలురాయి లాంటి 50వ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో.







