బియ్యం గింజలో 100 రాగి తీగలు

సూక్ష్మ పదార్థంపై ఓ వ్యక్తి అద్భుత కళారూపాన్ని ఆవిష్కరించారు.బియ్యం గింజలో నుంచి 100 రాగి తీగలు తీసి ఔరా అనిపించారు.

 100 Copper Wires In A Grain Of Rice Peddapalli Details, 100 Copper Wires , Grain-TeluguStop.com

ఆ వ్యక్తి ఎవరు.? ఆ అద్భుతం వెనుక ప్రతిభ ఏంటి మానవుడు అనుకుంటే ఏదయినా సాధించవచ్చు.ఏకాగ్రత, పట్టుదల ఉంటే తన కళారూపాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు అని నిరూపించాడు పెద్దపల్లి మండలానికి చెందిన వ్యక్తి.తనలో దాగి ఉన్న కళారూపాన్ని ప్రదర్శించారు.బియ్యం గింజలో రంధ్రం చేసి అందులో నుంచి 100 రాగి తీగలను తీశారు.

పెద్దపెల్లి మండలంలోని పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన ఏలేశ్వరం సత్య బాపు చారిది విశ్వబ్రాహ్మణ వృత్తి.బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు.10 మిల్లీ గ్రాముల బరువున్న ఒక బియ్యం గింజకు బెజ్జం చేసి ఒకటి రెండు కాదు ఏకంగా 100 సన్నటి రాగి తీగలను ఎక్కించారు.మరొక బియ్యం గింజకు కూడా 80 ధారం పొగులను ఎక్కించి, ఔరా అనిపించాడు.కరోనా సమయంలో తన నైపుణ్యానికి పదును పెట్టి ఓ అద్భుతాన్ని సృష్టించి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినంత ఆనందాన్ని సత్యబాపు చారి వ్యక్తపరుస్తున్నారు.

మానవుడిలో దాగి ఉన్న అద్భుత ప్రతిభను ఉత్తేజ రూపంలో వెలువరించడ మైందని.

Telugu Copper, Copper Grain, Eleshwaramsatya, Grain, Peddabonkur, Peddapally-Lat

ఏకాగ్రత, శక్తి ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.స్వతంత్ర ఆలోచనలు, నిజమైన భాష్యాలూ, సూక్ష్మ మైన కళా రూపాలను తయారు చేయడం వంటివి అంతరాత్మ‎లోకి వచ్చే ఆలోచనలని సత్యబాపు చారి తెలిపారు.ఈ అద్భుత కళారూపాన్ని ఆవిష్కరించారు… బియ్యం గింజలో నుంచి 100 రాగి తీగలు తీసి ఔరా అనిపించారు.

ఇక అద్భుతమైన ప్రతిభ కనబరిచే సూక్మ కళాకారులు చాలా మంది ఉన్నారని.అలాంటి వారిని ప్రోత్సహిస్తే.ఇలాంటి అద్భుత కళారూపాయలను మరిన్ని సృష్టించొవచ్చని సత్యబాపు చారి అంటున్నారు.మరి ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube