తెలుగు బుల్లి తెర ప్రేక్షకులతో పాటు వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితం అయిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి థాంక్యూ సినిమా కు ప్రత్యేక ఇంటర్వ్యూ చేయక పోవడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.ఆర్ ఆర్ ఆర్ నుండి మొదలుకుని బిత్తిరి సత్తి ప్రతి వారం కూడా సినిమా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాడు.
బిత్తిరోడి ఇంటర్వ్యూలను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.మిలియన్ ల కొద్ది వ్యూస్ వస్తున్న ఈ ఇంటర్వ్యూలు ఆయా సినిమా ల యొక్క క్రేజ్ ను పెంచేస్తున్నాయి.
అందుకే వరుసగా పెద్ద హీరోల నుండి మొదలుకుని చిన్న హీరోల వరకు ప్రతి ఒక్క సినిమా కు ప్రమోషనల్ ఇంటర్వ్యూను బిత్తిరి సత్తితో చేయిస్తున్నారు.కాని నేడు విడుదల అయిన థాంక్యూ సినిమా కు బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ చేయించలేదు.
ఇక బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ లు చేయడేమో అనుకుంటూ ఉండగా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామా రావ్ ఆన్ డ్యూటీ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ను చేశారు.
రవితేజ హీరో గా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రవి తేజ ఆన్ డ్యూటీ సినిమా వచ్చే వారం అంటే జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రవితేజ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు.తాజాగా బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా సినిమా స్థాయిని మరింతగా పెంచినట్లు అయ్యింది.
ఇప్పటి వరకు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు చేసిన సినిమా ల్లో మెజార్టీ సినిమా లు సక్సెస్ అయ్యాయి.కనుక మా బాస్ సినిమా రామా రావ్ ఆన్ డ్యూటీ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ రవితేజ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.







