చాలా మందికి పాములు చూస్తే చాలా భయం.ఎవరైనా పాము, పాము అని అరిచిన చాలు ఆమడ దూరం పారిపోతుంటాం.
అందులోనూ కాస్త పెద్ద పాము కనిపించిందంటే మరింతగా భయపడిపోతుంటాం. స్నేక్ క్యాచర్స్ కు ఫోన్ చేయడం, దాన్ని చంపేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం చేస్తుంటాం.
అయితే దాదాపు 10 అడుగుల పాము ఒక్కసారిగా కనిపిస్తే ఏం చేస్తారు.ఆ.అంత పెద్ద పాము కనిపిస్తే.ఇంకా అక్కడే ఎందుకుంటాం, ఊరుకులు పరుగులు పెడతాం అనుకుంటున్నారా… మీరు ఇలాగే అనుకున్నా వాళ్లు అచ్చం ఇలాగే చేశారు.
పది అడుగుల పాము కనిపించగానే గజగజా వణికిపోయారు. పిల్లా జెల్లను పట్టుకొని పరుగులు తీశారు.అయితే ఇదెక్కడ, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
10 అడుగులు తాచుపాము ఓ గ్రామంలో ప్రజలందరినీ వణికించింది.కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ సమీపంలోనే నారాగెరికి.దగ్గర్లోని అడవి నుంచి ఈ భారీ కోబ్రా వచ్చింది.ఇంతటి భారీ పామును చూసి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న సర్ప ప్రేమికుడు నితిన్ పూజారి… చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు.
అటవీ శాఖ సిబ్బంది సాయంతో అడవిలో విడిచి పెట్టాడు.అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.పామును అడవిలో విడిచి పెడుతుండగా.అది పైపైకి ఎగిరింది.చాలా జాగ్రత్తగా తోక పట్టుకున్న నితిన్ పూజారి.దాన్ని అడవిలో వదిలి పెట్టాడు.