రాష్ట్రంలో కాంగ్రేస్ తీరు మారనుందా...?

నల్లగొండ జిల్లా:రాష్ట్ర కాంగ్రేస్ పార్టీలో కొత్త కమిటీ రాబోతోందని పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీని గాడిలో పెట్టేందుకు బలమైన నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు.

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రేస్ ఘోర పరాభవంపై ఆయన పై విధంగా స్పందించారు.ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుని ముందుకెళుతామని,ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు.

Will The Congress Trend Change In The State?-రాష్ట్రంలో క�

గతంలో మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన గుర్తు చేశారు.యూపీలో 80 - 20 అనే మతతత్వ వాదన తెచ్చారని,అందుకే కాంగ్రెస్ అక్కడ గెలవలేకపోయిందనే కారణం చెప్పారు.

ఐదు రాష్ట్రాలలలో అభివృద్ధి మీద ఎన్నికలు జరగలేదని,మత రాజకీయాలపై జరిగాయని ఆరోపించారు.ఫలితాలపై సోనియా గాంధీతో చర్చించి, భవిష్యత్తు కార్యచరణ చేపడతామని వెల్లడించారు.

Advertisement

ఈ ఫలితాలతో క్యాడర్ ఎలాంటి డీలా పడకుండా ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని,గతంలో 24 సీట్లకు పరిమితమైన తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నామనే విషయాన్ని ప్రస్తావించారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రేస్ గురించి మంత్రి కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడారని,దేనికైనా సమయం వస్తుందని తెలిపారు.

టీవీల ముందు కూర్చొండని సీఎం కేసీఆర్ అంటే బిశ్వాల్ కమిటీ ప్రకారం అన్ని భర్తీ చేస్తారనుకున్నామని,40 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారనుకున్నామని, కానీ,అదంతా జరగలేదన్నారు.కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చాక ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు