హీరో సూర్యకు భారీ పోలీస్ బందోబస్తు...ఆ వివాదమే కారణమా?

తమిళ స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సూర్య ఈ మధ్య వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అదే సినిమాలో ఏదో ఒక అంశం వివాదానికి కారణం అవుతూ అతనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 Hero Surya Et Movie In Controversy Details, Surya, Tollywood, Police , Reason,-TeluguStop.com

గతంలో సూర్య నటించిన జై భీమ్ సినిమా పలు వివాదాలకు కారణం అయిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా సూర్య నటించిన ఈటీ సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుంది.

సూర్య నటించిన ఈ సినిమా 10వ తేదీన విడుదల అయింది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్‌ సంఘంకు చెందిన వారు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు.

ఇక సూర్య నటించిన ఈ సినిమానీ కడలూరు, విల్లుపురం జిల్లాలలో విడుదల చేయకూడదని కడలూరు కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.

Telugu Controversy, Et, Et Controversy, Surya, Jai Bheem, Pmk, Suriya, Tollywood

ఈ విధంగా సూర్య నటించిన సినిమా వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఆయన ఇంటి దగ్గర ఆందోళనలు లేదా ఇంటిపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో చెన్నైలోని సూర్య నివాసం వద్ద తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ క్రమంలోని సూర్య ఇంటి చుట్టు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత సూర్య మరో ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టి వరుస సినిమాలతో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube