భారతదేశంలో మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ వ్యాపారంలోకి ప్రవేశించిన హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌

బోట్‌ ఆపరేటర్లకు అత్యున్నత పనితీరు, మన్నిక, ఇంధన సామర్థ్యం, నిలకడైన అవకాశాలను నీటిలో అత్యున్నత శ్రేణి ఆపరేటింగ్‌ పనితీరుకు అందిస్తుంది.సముద్ర భద్రత, పెట్రోలింగ్‌, రెస్క్యూ మరియు ఇంటర్‌సెప్టర్‌ బోట్‌లు, ట్యాక్సీ బోట్‌ కోసం ప్రయాణీకుల పడవలు, పర్యాటక, విశ్రాంతి  పరిశ్రమలో వినోద భరితంగా చేపలుపట్టడం మరియు సముద్రంలో వాణిజ్య పరమైన చేపలు పట్టడం కోసం నమ్మతగిన పరిష్కారాన్ని అందిస్తుంది.అవసరమైన మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ మోటర్స్‌ (ఓబీఎం) ఇన్‌స్టాలేషన్‌తో ఛానెల్‌ భాగస్వాములు మరియు సర్వీసింగ్‌ నాలెడ్జ్‌, మౌలిక వసతులు వంటివి వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అసలైన విడిభాగాల సరఫరాతో అందిస్తుంది.90పీఎస్‌ కంటే అధికంగా కలిగిన మోడల్స్‌లో ఇండస్ట్రీ ఫస్ట్‌ అప్లికేషన్‌ – వీటీఈసీ (వేరియబల్‌ వాల్వ్‌ టైమింగ్‌ మరియు లిఫ్ట్‌ ఎలక్ట్రానిక్  కంట్రోల్‌), బ్లాస్ట్‌ (బూస్టెడ్‌ లో స్పీడ్‌ టార్క్‌), వంటివి కలిగి ఉంటే, ఎక్మో (హోండా యొక్క లీన్‌ బర్న్‌ కంట్రోల్‌ టెక్నాలజీ) ఫీచర్‌ 40పీఎస్‌ మరియు ఆ పైన మోడల్స్‌లో లభ్యమవుతుంది.ఇవన్నీ కూడా హోండా యొక్క ఆటోమొబైల్‌ టెక్నాలజీని సౌకర్యవంతమైన నీటి పనితీరుకు అందిస్తుంది.

 Honda India Power Products Forays Into Marine Outboard Business In India , Empow-TeluguStop.com

న్యూఢిల్లీ, 30 మార్చి 2022 మన భారతదేశంలో సుప్రసిద్ధ మరియు అత్యున్నత శ్రేణి పవర్‌ ప్రొడక్ట్‌ తయారీదారు మరియు పవర్‌ ప్రొడక్ట్స్‌ విభాగంలో గత 36 సంవత్సరాలుగా మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (HIPP) నేడు మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ వ్యాపారంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది.

ఏప్రిల్‌ 2022 నుంచి 4 స్ట్రోక్‌ మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ మోటర్స్‌ శ్రేణి విడుదల చేయనుంది.

హోండా 4 స్ట్రోక్‌ మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ మోటర్‌, బోట్‌ ఆపరేటర్లకు అత్యుత్తమ ఎంపికగా నిలువడంతో పాటుగా మారిటైమ్‌ బోర్డర్‌ సెక్యూరిటీ చేస్తోన్న ఆపరేటర్లకు, పర్యాటక, విశ్రాంత అప్లికేషన్‌లలో ఉన్న ట్యాక్సీ బోట్‌ కార్యకలాపాలు, వాణిజ్య ఫిషింగ్‌లో ఉన్న వర్క్‌బోట్‌ ఆపరేటర్లకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

ఈ విప్లవాత్మక, అత్యున్నత సాంకేతికత అతి మృదువుగా కార్యకలాపాలు నిర్వహించడానికి, నదులు మరియు సముద్రాలలో సైతం మెరుగైన పనితీరు కనబరచడానికి తోడ్పడనుంది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా శ్రీ తకహిరో ఊడా– ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, అధ్యక్షులు, సీఈఓ– హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ బోట్‌ ఆపరేటర్లు, సముద్ర రక్షణ, తీర ప్రాంత గస్తీ సేవలలో ఉన్న పలు ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రయాణీకులు, యాత్రికుల కోసం ట్యాక్సీ బోట్‌ సేవలనందిస్తున్న సంస్థలు , సముద్రంలో వాణిజ్య పరంగా చేపలు పట్టడంలో నిమగ్నమైన జాలర్లు, ఇన్‌ల్యాండ్‌ రివర్‌ సిస్టమ్స్‌ కోంసం నేడు 4 స్ట్రోక్‌ మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ మోటర్స్‌ శ్రేణిని పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము.

హోండా 4 స్ట్రోక్‌ ఓబీఎంలు సాటిలేని పనితీరు, మన్నిక, ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అందిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ప్రాధాన్యతా ఎంపికగా ఇది ఉంది.నేటి ప్రకటన భారతదేశలో మా 36 సంవత్సరాల వారసత్వంను పునరుద్ఘాటిస్తుంది.ఇది వైవిధ్యమైన ఉత్పత్తి శ్రేణి పవర్‌ ప్రొడక్ట్స్‌ను అందిస్తుంది.

వీటిలో పవర్‌ బ్యాకప్స్‌ , వ్యవసాయ, నిర్మాణ మరియు ఇప్పుడు మారిటైమ్‌ విభాగంలో ఉత్పత్తులు అందిస్తుంది’’ అని అన్నారు.

ఆయనే మరింతగా మాట్లాడుతూ ‘‘సరైన మార్కెట్‌ ప్రణాళిక, వినియోగదారుల అనుకూల విధానాన్ని మా సిద్ధాంతం ‘ఎంపవర్‌ పీపుల్‌ టు డు బెటర్‌’తో పాటుగా మా పర్యావరణ స్పృహ ప్రయత్నాలతో మారిటైమ్‌ కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు ఖచ్చితమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

అయినప్పటికీ, హోండా 4–స్ట్రోక్‌ ఓబీఎం టెక్నాలజీ ఆధారితమైన బలమైన మరియు స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము.భారతీయ మార్కెట్‌లో మా ఛానెల్‌ భాగస్వాముల ద్వారా ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్‌ రంగ యుటిలిటీలతో భాగస్వామ్యం చేసుకుని భారతీయ మెరైన్‌ మార్కెట్‌ను దీని పూర్తి సామర్థ్యం వైపు తీసుకు వెళ్లనున్నాం’’ అని అన్నారు.

హోండా మెరైన్‌ ఔట్‌ బోర్డ్‌ మోటర్స్‌ భారత దేశంలో హోండా ఆధీకృత సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ డీలర్‌ ఈఎస్‌ మారియో ఎక్స్‌పోర్ట్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా విక్రయిస్తుంది.వీరి ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది.

తీర ప్రాంత వ్యాప్తంగా 15 సర్వీస్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.అలాగే బే ఐల్యాండ్‌ ట్రేడింగ్‌ అండ్‌ మెరైన్‌ సర్వీసెస్‌ , పోర్ట్‌ బ్లెయిర్‌ ద్వారా అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల్లో సేవలను అందిస్తుంది.

హోండా 4 స్ట్రోక్‌ మెరైన్‌ ఔట్‌బోర్డ్‌ మోటర్‌ శ్రేణి గురించిన సమాచారం www.hondaindiapower.com

వద్ద మరియు ఫేస్‌బుక్‌ పేజీ /hondapowerproductsindia వద్ద పొందవచ్చు.అదనంగా వినియోగదారులు హోండా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800–11–2323కు కాల్‌ చేసి ఎంక్వైరీ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube