బీజేపీ ప్ర‌శాంతం.. టీడీపీలో తీవ్ర గంద‌ర‌గోళం..!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ప్ర‌ధానంగా అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేష్‌లు తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మ‌హానాడు మూడు రోజులూ ఇదే ఆందోళన ఈ ఇద్ద‌రిలోనూ క‌నిపించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.రాష్ట్రంలోత‌మ‌కు ప్ర‌థ‌మ శ‌త్రువు బీజేపీ యేన‌ని ఇద్ద‌రూ ఆరోపించారు.

బీజేపీకి బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు.అదేస‌మ‌యంలో ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని చ‌ర్విత చ‌ర్వ‌ణంగా మ‌ళ్లీ ఏక‌రువు పెట్టారు.

ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని అన్నారు.బీజేపీతో కుమ్మ‌క్క‌యిన జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను తిప్పికొట్టాల‌ని పిలునిచ్చారు.

Advertisement

మొత్తంగా మ‌హానాడు మూడు రోజులూ.బీజేపీ టార్గెట్‌గానే ప్ర‌సంగాలు పేలాయి! అయితే, ఈ విష‌యంలోనే విశ్లేష‌కులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.ఏపీలో అస‌లు ఉనికిలో కూడా లేని బీజేపీ గురించి చంద్ర‌బాబు ఇంత‌గా ఎందుకు ఆందోళ‌న చెందుతున్నారు? అనేది వీరి ప్ర‌ధాన ప్ర‌శ్న‌.నిజానికి 2014 ఎన్నిక‌ల‌ను తీసుకున్నా.4% ఓటు బ్యాంకు కూడా బీజేపీకి న‌మోదు కాలేదు.పోనీ.

ఈ నాలుగేళ్ల‌లో పుంజుకుందా? అంటే.అది కూడా లేదు.

మ‌రి ఇంత‌గా చంద్ర‌బాబు ఎందుకు క‌ల‌వ‌ర ప‌డుతున్నారు? అనేది మ‌రో ప్ర‌శ్న‌.రాజ‌కీయంగా చంద్ర‌బాబు తీవ్రంగా మ‌థ‌న ప‌డుతున్న‌ది బీజేపీ గురించే! వాస్త‌వానికి బీజేపీకి ఇప్పుడు చంద్ర‌బాబు ఇస్తున్న ప్ర‌చారం కార‌ణంగానే అది పుంజుకుంద‌ని చెప్పాలి.

లేకుంటే గ్రామ స్థాయిలోనూ నేడు బీజేపీ గురించిన చ‌ర్చ జ‌రిగేది కాదు.ఏ ఇద్ద‌రు క‌లిసినా.బీజేపీ గురించి చ‌ర్చించుకునేలా చేసింది బాబే! ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
అల్లు అర్జున్ ఆ తమిళ్ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వబోతున్నాడా..?

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌ని, ఏపీ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ గ‌తంలో ఎంత మోసం చేసిందో అంత‌కంటే ఎక్కువ‌గా ఇప్పుడు బీజేపీ మోసం చేస్తోంద‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌చారంతో కొంతైనా ఆ పార్టీకి డ్యామేజీ ఏర్ప‌డి ఉండాలి.ఈ సంద‌ర్భంలో బీజేపీ యాక్ష‌న్ ప్లాన్ అమ‌లు చేసి.

Advertisement

బాబు వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టేలా ప్ర‌చారం ఊపందుకునేలా చేసి ఉండాలి.కానీ, బీజేపీ అధిష్టానం స‌హా రాష్ట్ర నేత‌లు బాబు వ్యాఖ్య‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ఆయ‌న ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నా.కిమ్మ‌న‌డం లేదు.

పైగా.ఆయ‌న‌ను మేం పొమ్మ‌ని ఏనాడూ అన‌లేద‌ని అంటున్నారు.

నిధుల‌కు సంబంధించి లెక్క‌లు చూప‌కుండా నిధులు ఇవ్వ‌డం లేద‌ని చెప్ప‌డం సీనియ‌ర్ మోస్ట‌యిన చంద్ర‌బాబుకు త‌గునా అని ప్ర‌శ్నిస్తున్నారు.అంతే త‌ప్ప‌.

చంద్ర‌బాబును ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు.దీనిని బ‌ట్టి.

చంద్ర‌బాబులో ఉన్నంత గాబ‌రా.ఆందోళ‌న.

బీజేపీలో మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు.నేత‌లు ఎవ్వ‌రూ కూడా బాబును తిట్టిపోయ‌డం లేదు.

మ‌రి ఎందుకు బాబు అంత‌గా ఖంగారు ప‌డుతున్నారు? ఇక్క‌డ ఉనికిలోనే లేని పార్టీ గురించి ఓడించండి.అంటూ ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారు? అనేది వారికే తెలియాలి.మొత్తంగా లేని ఆందోళ‌న‌లో.

ఊహాజ‌నిత ఆవేద‌న‌లో బాబు అండ్ పార్టీ కూరుకుపోతోంద‌ని చెబుతున్న వారి సంఖ్య టీడీపీలోనే పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు