మెగా హీరో సినిమాను గుర్తు చేస్తున్న విశాల్‌

విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘అభిమన్యుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

తమిళంలో ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అభిమన్యుడు తెలుగులో కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.

సమంత హీరోయిన్‌గా నటించడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.ఇక ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.ట్రైలర్‌ చూస్తుంటే ఇటీవలే విడుదలైన మెగా మూవీ ‘నా పేరు సూర్య’ను మళ్లీ చూస్తున్నట్లుగానే ఉంది.

నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్‌ కూడా ఆర్మీ ఆఫీసర్‌ అనే విషయం తెల్సిందే.ఆర్మీ ఆఫీసర్‌ అయిన సూర్యకు కోపం ఎక్కువ.

Advertisement

ఆ కోపం కారణంగానే పలు ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

అచ్చు ‘అభిమన్యుడు’ చిత్రంలో కూడా నా పేరు సూర్య చిత్రంలో మాదిరిగానే ఆర్మీ ఆఫీసర్‌ అయిన విశాల్‌ అధిక కోపంతో ఉంటాడు.ఆ కోపం వల్ల ఆర్మీలో ఉన్న అతడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు.ఇలా సేమ్‌ టు సేమ్‌ కథ ఉన్న సినిమా కొన్ని వారాల గ్యాప్‌లో రావడం అరుదు.

ఇలా జరగడం కాకతాళియం కావచ్చు, కాని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారని భావించడం అవివేకం అవుతుందని ట్రేడ్‌ పండితులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో విశాల్‌కు మంచి మార్కెట్‌ ఉంది.

కాని ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబడుతుందనే నమ్మకం మాత్రం లేదు.విశాల్‌ ఆర్మీ ఆఫీసర్‌గా ఆకట్టుకుంటాడని, తప్పకుండా ఆర్మీ జవాన్‌ పాత్రలో మెప్పిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కనుక తెలుగులో కూడా విడుదల అవుతుందని అంతా భావిస్తున్నారు.కాని తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన పలు చిత్రాలు తెలుగులో బొక్క బోర్లా పడ్డాయి.

Advertisement

తెలుగులో హీరో విశాల్‌ సక్సెస్‌ను దక్కించుకుని చాలా కాలం అయ్యింది.అయినా కూడా ఈయన సినిమాలను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

ఇప్పటికైనా సక్సెస్‌ను దక్కించుకుని విశాల్‌ తన క్రేజ్‌ను కాపాడుకుంటాడేమో చూడాలి.తెలుగులో ఇలాంటి సినిమాలకు పెద్దగా ప్రేక్షకాధరణ ఉండదని ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్‌ సినిమా ద్వారా వెళ్లడైంది.

అయినా కూడా విశాల్‌ మూవీని భారీ ఎత్తున తెలుగు డిస్ట్రిబ్యూటర్లు విడుదలకు సిద్దం చేశాను.సమంతను ముందు పెట్టి ఈ సినిమా పబ్లిసిటీ చేస్తున్నారు.

తమిళంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యి, భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం తెలుగులో ఏమేరకు సక్సెస్‌ను సాధిస్తుందో చూడాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

తాజా వార్తలు