అంగస్తంభన సమస్యలు ఉంటే షాక్ ఇచ్చి నయం చేస్తారట

ప్రపంవ్యాప్తంగా రంగు - రూపు, సైజు .ఇలాంటి తేడాలేవి లేకుండా పురుషులు ఎదురుకుంటున్న అతిపెద్ద శృంగార సమస్య అంగం సరిగా స్తంభించకపోవడం, లేదంటే శృంగారం మధ్యలోనే పడిపోవడం.

ప్రతి ముగ్గురిలో ఒక్క పురుషుడికి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందట.ఇక మీరే అర్థం చేసుకోండి 30 లు దాటగానే శృంగార జీవితం ఎందుకు ఓ మూలాన పడిపోతోందో, వరల్డ్ వైడ్ గా ఎంతమంది పురుషులు ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారో.

ఈ సమస్య చికిత్స పేరుతో ఎన్నోరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.కొన్ని కేసుల్లో వయాగ్రా లాంటి మాత్రలతో పనికానిస్తారు, కొన్ని కేసుల్లో హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, కొన్ని కేసుల్లో రాడ్లు అమరుస్తారు .మరికొన్ని కేసుల్లో షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు.ఏంటి .షాక్ ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండి షాక్ ఇస్తారు.ఎక్కడ ఇస్తారు అని భయపడుతున్నారో అక్కడే ఇస్తారు, పురుషాంగం మీదే షాక్ ఇస్తారు.

ఇది బాగా పనిచేస్తున్న టెక్నిక్ అంట.అసలు అంగం ఎందుకు పడిపోతుంది ? అసలు ఆట కూడా మొదలవకుండా ఎందుకు స్తంభించదు ? కారణం ఏంటి ? ఏముంది? పురుషాంగంలోకి రక్తం రాకపోవడం వల్లనే.అంతేగా, పురుషాంగానికి అవసరమైన రక్త ప్రసరణ లేకపోతే అంగం స్తంభించదు.

Advertisement

పురుషుడిలో ఎప్పుడైతే కామోద్రేకం కలుగుతుందో, అప్పుడు రక్తనాళాలు పెద్దగా అయ్యి, పురుషాంగంలోకి రక్తం బాగా చేరుతుంది.దాంతో అంగం బాగా గట్టిపడుతుంది.శృంగారానికి కావాల్సింది గట్టిపడిన అంగమే.

అందుకే షాక్ ట్రీట్మెంట్ ద్వారా రక్త ప్రసరణ పెంచుతారు.కంగారు పడకండి .చాలా తక్కువ ఇంటన్సిటి ఉన్న షాక్ ఇస్తారు కాని మీరు ప్రమాదంలో పడేంత పెద్దగా ఇవ్వరు.జోల్ట్స్ లో కరెంట్ తక్కువే ఉంటుంది.

అంగం అలా ఉలిక్కిపడేలా చేస్తారు అంతే.రక్తప్రసరణ పెరిగేలా ఓ నాలుగైదు షాక్స్ ఇస్తారట.

మరి ఈ ట్రీట్మెంట్ సమయంలో మత్తుమందు ఏమైనా ఇస్తారా అని ఆశపడేరు .అలాంటిదేమీ ఉండదు.అయినా నొప్పి కూడా పెద్దగా ఉండదు అంట.ఓ ఇరవై నిమిషాలు టెన్షన్ పడకుండా, కొన్ని షాక్స్ ని బెదిరిపోకుండా ఎదుర్కోవాలి.అంతే, అంగం బాగా ఎనర్జీతో పనిచేయడం మొదలుపెడుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మీ ధైర్యం కోసం చెబుతున్నాం, ఇంగ్లాడ్ దిగ్గజ క్రికెట్ ఆటగాడు ఇయాన్ బోథం ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు.ఆరుపదులు దాటిన తరువాత కూడా ఆయన శృంగార జీవితం ఇంకా ఆసక్తికరంగా ఉండటానికి ఈ ట్రీట్మెంట్ కారణం అని అంటున్నాడు ఆయన.అయినా షాక్ ట్రీట్మెంట్స్ తో సమస్యలను నయం చేయడం గురించి మీరు ఇప్పుడే మొదటిసారి వినట్లేదుగా.ఫ్రాక్చర్స్, మెంటల్ సమస్యలు, కిడ్నీ రాళ్ళు .ఇలాంటి కొన్ని సమస్యలకి షాక్ ట్రీట్మెంట్ వాడుతున్నారుగా.

Advertisement

తాజా వార్తలు