కేంద్ర మంత్రి చెబితే ఫ్లాప్ సినిమా హిట్ అవుద్దా..?

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

ప్రేమ కావాలి అంటూ వచ్చిన ఆది ఆ ఒక్కటి తప్ప మిగతా సినిమాలన్ని నిరాశ పరచినవే ఇక కాస్తో కూస్తో లవ్ లీ పర్వాలేదనిపించింది.

అయితే రీసెంట్ గా ఆది హీరోగా వీరభద్రం డైరక్షన్లో వచ్చిన చుట్టాలబ్బాయ్ సినిమాలో తాను కూడా దొరబాబుగా నటించి కొడుక్కి ఓ హిట్ ఇచ్చేద్దామనుకున్న సాయి కుమార్ ఆశలు అడి ఆశలయ్యాయి.ఏమాత్రం కొత్తదనం లేని కథ కథనాలతో దర్శకుడు చుట్టేయడంతో మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అయినా సరే పోటీగా బలమైన హిట్ సినిమా ఏది లేకపోవడంతో ప్రమోషన్స్ తో సినిమా కనీసం జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు సాయి కుమార్.ఆ ప్రయంత్నంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి స్పెషల్ షో వేయించి ఆయనతో సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పించారు.

వెంకయ్య చెప్పినంత మాత్రాన ఫ్లాప్ హిట్ అవుతుందా వారి పిచ్చి కాబోతే.అంతేకాదు తన సర్కిల్ లోని మీడియా మిత్రులందరికి ఫోన్ చేసి మరి సినిమా గురించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వొద్దని చెబుతున్నాడట.

Advertisement

సినిమా బాగుంటే ఎలాంటి ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా హిట్ అవుతుందని తెలిసినా ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే ఎలా అని నవ్వుకుంటున్నారు సిని జనాలు.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు