ఆర్‌ఎస్‌ఎస్‌ మరో 'వాపసీ' కార్యక్రమం

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఆర్‌ఎస్ఎస్‌కు, హిందూత్వ సంస్థలకు రెక్కలొచ్చాయి.ఈ సంస్థలు తమ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.

హిందువులకు తామే అసలు సిసలు ప్రతినిధులమంటూ రెచ్చిపోతున్నాయి.దేశంలో హిందువుల సంఖ్య తగ్గిపోతోందని, ముస్లింలు పెరిగిపోతున్నారని ఆందోళన చెందుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఘర్‌ వాపసీ (ఇంటికి తిరిగిరండి) పేరుతో ఇతర మతాల్లో చేరిన హిందువులను సొంత మతంలోకి తీసుకువస్తున్నాయి.ఇస్లాంలో, క్రైస్తవంలో చేరిన హిందువులను బుజ్జగించి, బతిమాలి మళ్లీ హిందువులుగా మారుస్తున్నాయి.

ఈ కార్యక్రమం వివాదాస్పదంగా మారినా వదలిపెట్టకుండా నిర్వహిస్తున్నారు.ఇదే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్థలు ఇప్పుడు మరో కొత్త కార్యక్రమం ప్రారంభించాయి.

Advertisement

దాని పేరు గాంవ్‌ వాపసీ (గ్రామాలకు తిరిగి రండి) పొట్ట గడుపుకోవడం కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లిన ప్రజలు తాము పుట్టి పెరిగిన గ్రామాలకు ఏడాదికి ఒక్కసారైనా వచ్చి కొద్ది రోజులు గడపాలని హిందూత్వ సంసస్థలు పిలుపునిస్తున్నాయి.మేరే గాంవ్‌ మేరే తీర్‌్థ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాయి.

నా గ్రామమే నా పుణ్యక్షేత్రం అని దీని అర్థం.ఉత్తరాఖండ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

వలసలు అనేది ఈ రాష్ర్టంలో పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు