జగన్ అభిమానులకి కోపం తెప్పించిన రానా

ఏదైనా సెన్సీటీవ్ టాపిక్ మీద సినిమా తీయాలంటే ఎవరికైనా భయమే.అందులో రాజకీయాల మీద సినిమా అంటే అది ఖచ్చితంగా వివాదంలో చిక్కుకోవాల్సిందే.

రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురైంది.పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు తెలంగాణ ఉద్యమానికి బలైంది.

బాలకృష్ణ లెజెండ్ లో కూడా కొన్ని వివాదాస్పదమైన డైలాగ్స్ ఉంటే తొలగించేసారు.ఇప్పుడు ఓ వర్గం రాజకీయనాయకులకి, అభిమానులకి కోపం తెప్పించింది రానా దగ్గుబాటి నటించిన "నేనే రాజు నేనే మంత్రి".

ఇక్కడ ఓ వర్గం ఇండైరేక్టుగా చెప్పడం ఎందుకు కాని, ఆంధ్రపదేశ్ విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద కావాలనే డైలాగ్స్ పెట్టారని ఆ పార్టి అభిమానుల ఆరోపణ అలాగే ఆగ్రహం.కథలో ఓ కీలక పాత్ర (ఎవరో చెప్పకూడదు) చనిపోయినప్పుడు హీరో శవరాజకీయాలు చేస్తున్నాడని, ప్రజల్లో సింపతి పొందేందుకు యత్నిస్తున్నాడని, చెంపలు పట్టుకోవడం, తలలు నిమరడం బాగా అలవాటైందనే అర్థంలో ఒక డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో.

Advertisement

ఈ డైలాగ్ జగన్ మోహన్ రెడ్డి మీద వేసిన కౌంటర్ అని తేల్చేసారు సినీ అభిమానులు.రాజశేఖర్ రెడ్డి మృతి తరువాత జగన్ చేసిన ఓదార్పు యాత్రతో పోలుస్తూ, ఈ డైలాగ్ రాసారని, బాధలో జగన్ చేసిన ఓదార్పుని కించపరిచారని వైకాపా అభిమానులు ఆగ్రహావేశానికి లోనవుతున్నారు.

ఇక తెదేపా వారు మాత్రం ఈ డైలాగ్ పట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.మరి ఈ వివాదం పెద్దగా అవుతుందా లేక చూసి చూడనట్టు వదిలేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు