పవన్ - త్రివిక్రమ్ సినిమా రికార్డు ... దాని టైటిల్ ఇదే ?

జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారి హిట్లు సాధించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

వీరి కాంబినేషన్లో లాస్ట్ టైం వచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇప్పుడు వస్తున్న మూడోవ సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి.

అందుకే సినిమా బిజినెస్ కూడా అంచనాలకు మించి జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ స్పైడర్ కి మించి ఉండబోతోంది.

ఇక వరల్డ్ వైడ్ గా స్పైడర్ ని దాటడం కష్టమే అయినా, శాటిలైట్ హక్కుల విషయంలో మాత్రం స్పైడర్ కి తిరుగులేని జవాబు దొరికింది.జెమిని టీవి ఈ సినిమా టెలికాస్ట్ హక్కులని ఎంతకి కొన్నదో తెలుసా ? 21 కోట్లు.అవును, మొదట 19.50 కోట్లకు ఫైనలైజ్ అవుతుంది అనుకున్న డీల్ కాస్త మరో కోటిన్నర పెరిగి 21 కోట్ల వద్ద సెటిల్ అయ్యింది.ఇది తెలుగు వెర్షన్ వరకు భారి రికార్డు.

ఇంతకుముందు నాన్ - బాహుబలి చిత్రాల్లో ఈ రికార్డు స్పైడర్ పేరిట ఉండేది.ఇక హిందీ శాటిలైట్ ఏకంగా 11 కోట్లకు అమ్ముడుపోవడం ఆశ్చర్యకరం.

Advertisement

ఇక్కడ కూడా స్పైడర్ ని బీట్ చేసింది పవన్ కళ్యాణ్ సినిమా.స్పైడర్ హిందీ శాటిలైట్ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోగా, త్రివిక్రమ్ సినిమా ఓ కోటి ఎక్కువే చేసింది.స్పైడర్ తెలుగు హిందీ శాటిలైట్ కలిపి 26 కోట్లు సాధిస్తే, పవన్ - త్రివిక్రమ్ సినిమా ఏకంగా 32 కోట్లు చేసింది.(21+11).ఇంకా స్పైడర్ కి సంబంధించి తమిళం, మలయాళం శాటిలైట్ హక్కులు అమ్మలేదు కాబట్టి, అప్పటివరకు ఆ రికార్డు పవన్ కళ్యాణ్ సినిమాదే.

అలాగే భరత్ అనే నేను సినిమాకి జెమిని టీవి ప్రస్తుతం అడుగుతున్న రేటు 22 కోట్లు, నిర్మాతలు 25 అడుగుతున్నారు.మరి ఈ డీల్ సెట్ అయినా, రికార్డు త్వరలోనే తిరిగిపొందుతాడు ప్రిన్స్.

ఇక పవన్ 25వ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది.అదే "ఇంజనీర్ అల్లుడు".

ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.కీర్తి సురేష్, అను ఏమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు