మెగా ముద్దపప్పు సూపర్‌ హిట్‌

టాలీవుడ్‌లో మెగా అంటే ఒక బ్రాండ్‌.మెగా ఇమేజ్‌తో ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఇప్పటికే స్టార్‌ హీరోలుగా అయ్యారు.

ఇదే బ్రాండ్‌తో నిహారిక బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మెగా వారసురాలు అంటూ బుల్లి తెరపై ఈమెకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

బుల్లి తెరపై వచ్చిన క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఈ అమ్మడు వెండి తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.ఈమె ప్రస్తుతం ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.అతి త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

ఆ సినిమాకు ముందే ఈమె ఒక యూట్యూబ్‌ సీరియల్‌లో నటిస్తోంది.‘ముద్దపప్పు ఆవకాయ్‌’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సీరియల్‌కు ప్రస్తుతం అనూహ్య స్పందన వస్తోంది.

ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్లు యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ సీరియల్‌ యూనిట్‌ సభ్యులు కూడా ఊహించని స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి.మొదటి ఎపిసోడ్‌కు 7.5 లక్షల వ్యూస్‌ వచ్చాయి.ఇక ఇటీవలే వచ్చిన రెండవ ఎపిసోడ్‌కు అప్పుడే 6.5 లక్షలు వచ్చాయి.మొత్తంగా ఒక్కో ఎపిసోడ్‌కు 10 లక్షల వ్యూస్‌ వస్తాయనే అంచనాలున్నాయి.

ఒక్కో ఎపిసోడ్‌ 10 లక్షల వ్యూస్‌ అంటే రికార్డు అన్నట్లే.నిహారికకు జోడీగా ప్రతాప్‌ నటిస్తున్నాడు.

నిహారి ఈ సీరియల్‌ ద్వారా భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.తెలుగు వెబ్‌ సీరియల్‌ను మొదలు పెట్టి సరి కొత్త పంథాకు మార్గం వేసిన మెగా హీరోయిన్‌కు అన్ని వర్గాల నుండి ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు