చిలగడదుంప రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

బంగాళాదుంప అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణమైన ఆహారం.దీనిలో పిండి పదార్దాలు సమృద్దిగా ఉంటాయి.

అయితే చిలకడ దుంప గురించి మనకు ఏమి తెలుసు? వాస్తవానికి బంగాళదుంప కంటే చిలకడ దుంప ఆరోగ్యానికి మంచిది.కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన చిలగడదుంపలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వారు లేత రెమ్మలు మరియు ఆకులను తరచుగా ఆకుకూరల రూపంలో తింటారు.సాదారణంగా చిలకడ దుంపలు ఎరుపు, పసుపు, గోధుమ, ఆరెంజ్ మరియు ఊదా రంగులలో ఉంటాయి.

చిలకడ దుంప రసంలో అనేక పోషకాలు ఉండుట వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.చిలకడ దుంప గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచటానికి,రక్తంలో చక్కెర స్తాయిల నియంత్రణ మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.ఇప్పుడు చిలకడ దుంపలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

1.ఫైబర్ సమృద్దిగా ఉంటుంది

ఆహారంలో ఫైబర్ సమృద్దిగా ఉంటే జీవ ప్రక్రియ సజావుగా సాగి జీర్ణ సంబంద రుగ్మతలు ఏమి రాకుండా సహాయపడుతుంది.

2.చర్మ ఆరోగ్యం

చిలకడ దుంపలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన ఆరోగ్యకరమైన చర్మ నిర్వహణకు సహాయపడుతుంది.

3.మెదడు ఆరోగ్యం

చిలగడదుంప రసం ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.దాంతో మెదడు ఆరోగ్యం బాగుంటుంది.

4.కంటి చూపు మెరుగుదల

విటమిన్ ఎ లోపం ఉంటే కంటి చూపు తగ్గుతుంది.ఈ రోజుల్లో ఈ సమస్య చిన్న పిలల్లో ఎక్కువగా కనపడుతుంది.చిలకడ దుంప రసంలో విటమిన్ ఎ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది.

5.చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది

చిలకడ దుంపలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని యవన్నంగా ఉంచుతుంది.

6.సమృద్దిగా ఐరన్

చిలకడ దుంపలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు ఆరోగ్యానికి సహాయం మరియు రక్త హీనత రాకుండా కాపాడుతుంది.

Advertisement
భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా

తాజా వార్తలు