కరివేపాకు వలన ఇన్ని లాభాలా!

ఎవరైన మనల్ని పట్టించుకోకపోతే కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు అని అంటాం మనం.

సామెత సరదాగా ఉంటుంది కాని, కూరలో కరివేపాకు తీసి పడేయ్యడం సరదా పని కాదు.

ఎందుకంటే కరివేపాకులో ఐరన్, ఫోలిక్ ఆసిడ్ బాగా లభిస్తాయి.ఐరన్ డెఫిషియెన్సితో బాధపడకూడదంటే కరివేపాకు చాలా అవసరం.

జర్నల్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ కథనం ప్రకారం, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులోకి తెచ్చే శక్తి కరివేపాకులో ఉంది.ఇది ఇన్సులిన్ ఆక్టివిటిని చాలా ప్రభావితం చేస్తుందట.

కరివేపాకులో ఫైబర్ కూడా బాగా దొరుకుతుంది.పొద్దున్నే కరివేపాకు తింటే జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగం.

Advertisement

కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గడానికి కూడా కరివేపాకు సహాయపడుతుంది.దగ్గుతో బాధపడుతున్న వారికి కరివేపాకు ఔషధంలా పనిచేస్తుంది.

ఇందులో లభించే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇంఫ్లేమెటరీ లక్షణాలు ఛాతి నొప్పి, దగ్గు, జలుబుతో పోరాడతాయి.మొటిమలతో ఇబ్బంది పడేవారు చవకగా కరివేపాకు సహాయం తీసుకుంటే మంచిది.

యాంటి-బ్యాక్టిరియా, యాంటి-ఫంగల్ లక్షణాలు ఉంటాయి కరివేపాకులో.మీ చర్మ అరోగ్యానికి కరివేపాకు చాలా మంచిది.

కరివేపాకులోని కెంప్ఫెరాల్, యాంటిఆక్సిడెంట్స్ లివర్ అరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.మద్యం అతిగా సేవించేవారు రోజూ కరివేపాకు తింటే, కుదిరినంత సేపు లివర్ ని కాపాడుకోవచ్చు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా

జుట్టు బాగా ఎదగడానికి, బలంగా ఉండటానికి కూడా కరివేపాకు పనికివస్తుంది.

Advertisement

తాజా వార్తలు