బతికి పోయిన బెల్లంకొండ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.

ఈయన నిర్మించిన తాజా చిత్రం ‘గంగ’ను విడుదల చేయడంలో విఫలం అయ్యాడు.

తమిళ వర్షన్‌తో పాటు తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉన్న ‘గంగ’ సినిమా వాయిదా వేసి నేడు విడుదల చేయాలని భావించాడు.దిల్‌రాజు సాయంతో ‘గంగ’ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశాడు.

అయితే చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నించారు.దాంతో కొన్ని థియేటర్లలో ఉదయం షోలు ప్రారంభం కాలేదు.

ప్రారంభం అయినా కూడా లేట్‌గా అయ్యాయి.నేడు ఈ సినిమా విడుదల వాయిదా పడి ఉంటే బెల్లంకొండకు మరింత నష్టం జరిగేది.

Advertisement

ఒక వైపు ‘ఉత్తమ విలన్‌’ విడుదల ఆగిపోయిన సమయంలో ఈ సినిమా విడుదల అవ్వడంతో భారీ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి.ఈరోజు ‘గంగ’ను విడుదల చేయకపోతే ఈ భారీ ఓపెనింగ్స్‌ కోల్పోవాల్సి వచ్చేది.

ఈ వారం మొత్తం కూడా ‘గంగ’ సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకునే అవకాశాలున్నాయి.మొత్తానికి ‘గంగ’ సినిమాను ఈరోజు ఎలాగోలా విడుదల చేసి బెల్లంకొండ బతికి పోయాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు