నిండా మునుగుతున్న స్టార్ నిర్మాతలు

తొలిచిత్రం నమో వెంకటేషా యావరేజ్ గా ఆడినా, రెండొవ చిత్రంతోనే పెను సంచలనాన్ని రేపారు 14 రీల్స్ నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర.

ఆ "దూకుడు" కొనసాగుతూ ఉండాలని, తమ అభిమాన నటుడు మహేష్ బాబుతో వరసబెట్టి మరో రెండు సినిమాలు చేశారు.

ఇటు 1-నేనొక్కడినే, అటు ఆగడు, రెండిటికీ రెండూ గురితప్పాయి.పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

కారణం, అప్పుడు తమ అభిమాన హీరో కోసం కాంబినేషన్ చూసారు తప్ప జనాలు మెచ్చే కథలను చూడలేదు.దెబ్బకు భారీ చిత్రాల నిర్మాతలు కాస్త నాని, రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఆగడు తరువాత 14 రీల్స్ పీకల్లోతు అప్పుల్లో వెళ్ళిపోయిందట, లేదంటే మహేష్ బాబుతో మరో సినిమా నిర్మించాలనుకున్నారు.కాని వారి అదృష్టం ఏంటంటే, వారు నిర్మించాల్సిన చిత్రం పివిపి చేతిలో పడింది.

Advertisement

అదే బ్రహ్మోత్సవం.అది కూడా 14 రీల్స్ ఖాతాలోనే పడుంటే మరింత దారుణం జరిగిపోయేది.

మధ్యలో లెజెండ్, కృష్ణగాడి వీరప్రేమగాధ, రెండు పరిస్థితులు చక్కబరిస్తే, ఇప్పుడు హైపర్ మళ్ళీ గడ్డుకాలాన్ని తీసుకొచ్చింది.ఏదో సరదా కోసం విజయయాత్రలు చేసుకుంటున్నా, సినిమా పెద్దగా ఆడటల్లేదని ట్రేడ్ వర్గాల రిపోర్ట్.

సో, ఓ అరిగిపోయిన మాస్ సినిమాతో మళ్ళీ చేతులు కాల్చుకున్నారు అన్నమాట.సినిమాల మీద విపరీతమైన ప్రేమ, ఆసక్తి ఉన్న నిర్మాతలకి ఇలా జరగడం బాధకరమైన విషయమే అయినా, కథల ఎంపికలో జాగ్రత్తగా లేకపోతే ఎవరేం చేస్తారు.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు