అక్కా చెల్లెళ్ళకు పుట్టినిల్లు,మెట్టినిల్లు ఒక్కటే ఉండవచ్చునా?

ఒకే ఇంటి నుండి ఇద్దరు అమ్మాయిలను (ఒకే తండ్రి పిల్లలు అని ఇక్కడ ఉద్దేశం ),మరొక ఇంటికి సంబంధించిన ఇద్దరు అబ్బాయిలకు (ఒకే తండ్రి పిల్లలు అని ఇక్కడ ఉద్దేశం )పెళ్లి చేయవచ్చునా? కొద్ది మందికి ఇది ధర్మ సందేహం.

ఐతే దీనికి వేద ప్రమాణంగా లేదా స్మృతి ప్రమాణంగా కాని చూసినా, ఎక్కడా ఆధారపూర్వకంగా సమాధానం దొరకదు.

ఎందుకంటే ఇటువంటి వివాహములు జరగకూడదని పండితులు అంటారు.ఐతే ఈ రోజుల్లో సొంత అన్న దమ్ములు మధ్యే తగాదాలు ఉండడం సహజం.

అలాంటిది ఒకే ఇంటి పిల్లలు తోడి కోడళ్ళు అవ్వడము వలన తగాదాలు ఉండవు అని భావించి , వివాహం చెయ్యవలసిన అవసరం లేదు.చాలా మంది పెద్దలు ఆలోచనచేసి ఇలాంటి వివాహం వలన సమస్యలు అధికంగా ఉండడం గమనించి ఇటువంటి వివాహాలు అనవసరమని చెప్పారు.

ఉత్తర భారతదేశంలో మాత్రం ఇటువంటి వివాహములు అసలు చేసుకోరు.

Advertisement
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

తాజా వార్తలు