ఏపీ, తెలంగాణ‌పై బీజేపీ అదిరే స్కెచ్

ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2019 ఎన్నిక‌ల్లో బలోపేతం అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.దానికి త‌గిన విధంగా ప‌క్కా స్కెచ్‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఏపీ, తెలంగాణ‌ల్లోనూ ఆ పార్టీ త‌న దూకుడును పెంచ‌డం ద్వారా చిన్న‌రాష్ట్రాల్లో పెద్ద పార్టీగా అవ‌త‌రించాల‌ని నిర్ణ‌యిచింది.ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, క‌మ‌ల ద‌ళాధిక‌ప‌తి అమిత్ షా బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొని పెద్ద ఎత్తున కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ విమోచ‌న దినాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునివ్వ‌డం ద్వారా కేసీఆర్‌ను పూర్తిగా ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.ఫ‌లితంగా బీజేపీ నేత‌లు ఏం మాట్లాడినా.

లెక్క‌లు త‌ప్ప‌వ‌నే టాక్ వ‌చ్చింది.ఇక, ఇప్పుడు క‌మ‌ల నాథులు త‌మ ఫోక‌స్‌ను ఏపీపై పెట్టారు.

Advertisement

అయితే, ఇక్క‌డ అధికారంలో ఉన్న‌ది ఎన్‌డీఏ ప్ర‌భుత్వం.కాబ‌ట్టి ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

ఈ క్ర‌మంలోనే విప‌క్షాల‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా తాము ఎద‌గాల‌ని క‌మ‌ల ద‌ళం స్కెచ్‌! ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాపై ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, జ‌న‌సేనాని ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారాల‌కు కౌంట‌ర్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు.ప్ర‌త్యేక హోదా ను ఎందుకు ఇవ్వ‌లేక‌పోయాం, అయినా దానికి రెండింత‌ల లాభంతో ప్యాకేజీ ఇచ్చాం క‌దా అని చెప్పుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వహించే రైతు సదస్సుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు.రాష్ట్రంలో రైతులకు కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని షా వివ‌రించ‌నున్నారు.

ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి చేకూరే లబ్దిని సదస్సు ద్వారా వివరించడంతో పాటు పార్టీ కోర్ కమిటీని ప్రత్యేకంగా సమావేశ పరచి అమిత్ షా దిశా నిర్థేశం చేయనున్నారు.అదేవిధంగా.అదేవిధంగా జనవరి 3న తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వ‌చ్చేలా ప్లాన్ చేశారు.2014 ఎన్నికలకు ముందు ఏపీకి హోదా ఇస్తామ‌ని తిరుపతి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు - వెంకయ్యనాయుడుల‌ సమక్షంలో మోదీ వాగ్దానం చేశారు.అయితే, ఆ త‌ర్వాత ఆయ‌న ప్లేటు ఫిరాయించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

ఇప్పుడిదే అంశాన్ని విపక్షనేత జగ‌న్‌- జనసేన అధినేత పవన్ ప‌దేప‌దే ప్రస్తావిస్తున్నారు.ఈ క్ర‌మంలో తిరుపతి బహిరంగ సభ ద్వారా ప్రధాని మోదీ విపక్షాలపై ఎదురుదాడికి దిగనున్నట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Advertisement

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పట్టు సాధించేందుకు బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తుగ‌డే వేశారని తెలుస్తోంది.ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు