ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌కు క‌ష్టాలు

ప్ర‌తిప‌క్ష వైసీపీని క‌ష్టాలు వ‌ద‌లడం లేదు! ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నారు.

అస‌లే పార్టీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌వుతున్న జ‌గ‌న్‌కు.

ఇప్పుడు కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి, ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ ర‌హిత చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధమ‌వుతున్న‌ట్లు స‌మాచారం! వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది.గ‌తేడాది జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద వైసీపీ ఎమ్మెల్యేలు గంద‌ర‌గోళం సృష్టించారు.

మైకులు విర‌గొట్టారు.దీనిపై విచార‌ణ పూర్తిచేసిన స‌భా హ‌క్కుల క‌మిటీ.

స్పీక‌ర్‌కు నివేదిక అంద‌జేసింది.దీంతో ఇప్పుడు వీరిపై ఏ విధ‌మైన చ‌ర్యలు తీసుకుంటారో అనే టెన్ష‌న్ వైసీపీలో మొద‌లైంది.

Advertisement

గ‌త అసెంబ్లీ సమావేశాల్లో స్పీక‌ర్ పోడియం వద్ద వైసీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు నిరసనను నిర్వహించిన సంగతి తెలిసిందే.వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికార ప‌క్షం చేసిన డిమాండ్ మేర‌కు వారికి నోటీసులు జారీచేశారు.

ఈ ఉదంతంపై సభాహక్కుల కమిటీ విచారించి వివ‌ర‌ణ కూడా తీసుకుంది.ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

వీరిపై చర్యలు తీసుకోవాలని సభాపతికి సిఫార్సు చేసినట్లుగా చెబుతున్నారు.ఎమ్మెల్యే పేరు.

వారుచేసిన తప్పులు.వారు వ్యవహరించిన తీరును పేర్కొంటూ నివేదిక స‌మ‌ర్పించార‌ట‌.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

ఫిబ్రవరి మొదటివారంలో ఈ నివేదికను సభాపతి కోడెల శివప్రసాద్ కు ఇస్తామని హ‌క్కుల క‌మిటీ స‌భ్యులు చెబుతున్నారు.చర్యలు తప్పవని చెబుతున్న ఐదుగురు జగన్ ఎమ్మెల్యేలలో.

Advertisement

దాడిశెట్టి రాజా.ఆళ్ల రామకృష్ణా రెడ్డి.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.బి.ముత్యాలనాయుడు.కె.శ్రీనివాసులు ఉన్నారు.గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నిర్వహించినఈ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని కమిటీ సభ్యుడు.

వైసీపీ రామచంద్రారెడ్డి వ్య‌తిరేకించారు.సభను అడ్డుకోవటం కొత్తేం కాదని గతంలో చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు.

ఆయన చేసిన వ్యాఖ్యలకు ఉప సభాపతి కన్నీళ్లు పెట్టుకున్నార‌న్నారు.

తాజా వార్తలు