పవన్ రాజకీయాల్లో జీరో.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నారని అన్నారు.

 Zero In Pawan's Politics.. Minister Kakani's Key Comments-TeluguStop.com

మూడు రాజధానులకు అంగీకరించి వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.పవన్ రాజకీయాల్లో జీరో అన్న ఆయన.గతంలో పవన్ ను ప్రజలు రెండు చోట్ల ఓడించారని గుర్తు చేశారు.ప్యాకేజీల పవన్ గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారని ఎద్దేవా చేశారు.

అనంతరం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.దత్తపుత్రుడిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యమని వ్యాఖ్యనించారు.

చంద్రబాబును సీఎం చేయడమే పవన్ అజెండా అని వెల్లడించారు.తప్పు చేస్తే ఎవరినీ విడిచి పెట్టమన్న మంత్రి కాకాణి.

రాజ్యాంగానికేమైనా పవన్ అతీతుడా అని ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube