వైఎస్ఆర్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికీ ఉండదని చెప్పారు.
ఇది ప్రజలు కోరుకుంటే వచ్చిన ఉపఎన్నిక కాదని అన్నారు.మునుగోడు ఉపఎన్నికలో వేయి కోట్లు ఖర్చు చేస్తున్నారు అని, హామీలు అమలు చేయని బిజెపి ఓట్లు అడుగుతుందని ఆరోపించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ము కేసిఆర్ కు లేదని విమర్శించారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తానని ఆమె తెలిపారు.
రాజకీయాల్లో జగన్ కాదు.నాన్నే తనకు రోల్ మోడల్ అని అన్నారు.
మునుగోడు లో టిఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు.