గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల వివాదంలో చిక్కుకోవడం, ఆమెపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం, అక్కడి నుంచి ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు రావడం వారు జిలా జాయింట్ కలెక్టర్ తో నోటీసులు ఇప్పించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేయడంతో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు.
ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను క్రిస్టియన్ అంటూ శ్రీదేవి వ్యాఖ్యానించడంతో ఈ వివాదం చెలరేగింది.ఈ ఇంటర్వ్యూ నే సాక్ష్యంగా చూపించి ఆమె ఎస్సీ కాదు అంటూ ఆమె ప్రత్యర్థులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట విచారణకు హాజరయ్యారు.శ్రీదేవి తన కుటుంబానికి చెందిన మూడు తరాల కుల ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.
ఇప్పుడు జాయింట్ కలెక్టర్ విచారణలో ఆమె ఎస్సీనా లేదా క్రిస్టియన్ నా అనే విషయంలో క్లారిటీ వస్తుంది.ఒకవేళ విచారణలో ఆమె ఎస్సీ కాదు అనే విషయం బయటపడితే ఆమె ఎమ్యెల్యే పదవి పోవడం ఖాయం.