ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర..

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి బస్సు యాత్ర వివరాలను మీడియాకు వివరించిన పార్టీ సీనియర్‌ నేతలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.ప్రతి పార్లమెంట్, ప్రతి జిల్లా మేం సిద్ధం అనేలా బస్సు యాత్ర.

 Ysrcp Leaders About Cm Jagan Bus Yatra Details, Ysrcp Leaders ,cm Jagan Bus Yatr-TeluguStop.com

‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలిసభ 27వ తేదీన ప్రొద్దుటూరులో ప్రారంభం.ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ కొనసాగనున్న యాత్ర.

ఎంత మంది కూటమి కట్టినా…మా బ్రాండ్ జగన్ గారే.! : శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి.ఈనెల 27 నుంచి శ్రీ వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర.సిద్ధం సభలకు ధీటుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సభలు.క్షేత్ర స్థాయిలో వివిధ వర్గాలతో ఇంటరాక్షన్‌.సలహాలు, సూచనల స్వీకరించనున్న సీఎం పాదయాత్రలో ప్రజలతో మమేకమైనట్లే బస్సు యాత్ర కూడా సాగుతుంది.

: శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి.

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా జగన్‌ గారి బస్సు యాత్ర: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరుణంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ 4 సిద్ధం సభలు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహించింది.రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించాం.ఈ నాలుగు సభలు జరిగిన తీరు, అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు.

మా అధినాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారికి నీరాజనాలు పట్టారు.చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారుపేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు.

మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి.ఇలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు అనే మార్గదర్శకత్వం ఇచ్చారు.

ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్‌ స్టెప్‌గా బస్సు యాత్ర చేపడుతున్నారు.ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టాం.

ఒక వైపు సిద్ధం సభల ప్రతిధ్వని వినిపించింది.జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఇటువైపు పడింది.

దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మేము సిద్ధం, మా బూత్‌ సిద్ధం అని బూత్‌ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారు.వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు.

ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ: ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు.కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర.రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అని డిక్లేర్‌ చేసే సందర్భం ఇది.27వ తేదీ మొదలైతే.నోటిఫికేషన్‌ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది.సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్‌ జరుగుతుంది.

ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలకు ముఖ్యమంత్రి గారు బయలుదేరతారు.మా పార్టీ పెట్టినప్పటి నుంచీ అట్టడుగు వర్గాల వైపు నిలబడి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు వారి కోసం జగన్‌ గారు తపన పడ్డారు.

ఇదే రీతిలో 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు.పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు.27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి ‘మేమంతా సిద్ధం’సభ జరుగుతుంది.

చాలా పెద్ద ఎత్తున ఈ సభలు జరుగుతాయి.అంచనాలకు మించి జరుగుతాయి.

గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో ఒక మహాసభ జరుగుతుంది.ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్‌ చేసేలా ఈ సభలు జరుగుతాయి.

బస్సు యాత్రలో ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఉంటుంది.ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు.

మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారు.సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు.

వీలైనంత వరకూ ఒక పార్లమెంటులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాం.

ఎంత మంది కూటమి కట్టినా మా బ్రాండ్‌ జగన్‌ గారే: అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకంగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం.మా వైపు ఒంటరిగా వస్తున్నారు.స్పష్టమైన ఒక బ్రాండ్‌ వైఎస్సార్సీపీకి జగన్‌మోహన్‌రెడ్డి గారే.ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తాం.ఇప్పటికి బస్సు యాత్ర 3 రోజుల వరకూ ఖరారు అయింది.

తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ.మూడో రోజు కర్నూలు పార్లమెంటులోకి ప్రవేశిస్తారు.ఎమ్మిగనూరులో సభ ఉంటుంది.ఈ బస్సు యాత్రలో జగన్‌ గారి యాక్టివిటీ అంతా పాదయాత్రలో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube