వైసీపీ ఆవేద‌నలో అర్ధం ఉంది.. కాక‌పోతే.. ప‌ట్టించుకునేదెవ‌రు...?

ఒక అడుగు ముందుకు వేస్తే.మూడు అడుగులు వెన‌క్కి ప‌డుతున్నాయి.

 Ysrcp In Deep Frustation But No One Can Care About That, Tdp, Ysrcp, Chandra Bab-TeluguStop.com

ఒక నిర్ణ‌యం తీసుకుని అమ‌లు చేద్దామ‌నుకునేలోపే.ఆగండి! అంటూ కోర్టుల నుంచి ఉత్త‌ర్వులు.

ఈలోగా.రాష్ట్రంలో ఏదో ఒక మూల‌.

ద‌ళితుల‌పై దాడులు.పోలీసుల అత్యుత్సాహం.

నేత‌ల దూకుడు.ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు.

ఇదీ.ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లో క‌నిపిస్తున్న ప‌రిస్తితి! దీంతో వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ స‌హా ఆ పార్టీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.“మేం ఇంత చేస్తున్నా.ప‌ట్టించుకోవ‌డం లేదు.

మేం ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌తిప‌క్షాలు గుడ్డిగా కోర్టుకు వెళ్తున్నాయి.ఇక మేం పాలించ‌డం ఎలా?“అని వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

స‌హ‌జంగానే ఏ ప్ర‌భుత్వంపై అయినా.ప్ర‌తిప‌క్షాల నుంచి ఈ రేంజ్‌లోనే దాడి ఉంటుంది.ఈ విష‌యంలో గ‌తంలో చంద్ర‌బాబు కూడా అనేక ఆటుపోట్లు చవిచూశారు.రాజధాని ఆల‌స్యం కావ‌డానికి కూడా అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ వేసిన కేసులేన‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికీ చెబుతారు.

సో.ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌పై ఎప్పుడూ .కోర్టుల్లో కేసులు ప‌డుతూనే ఉంటాయి.అయితే, వైసీపీ ఆవేద‌న వేరేగా ఉంది.

తాజాగా రాజ‌ధాని భూముల విష‌యంలో మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌.ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్ స‌హా మ‌రికొంద‌రిపై ఏసీబీ ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసిన విష‌యంలో హైకోర్టు స్టే ఇవ్వ‌డం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది.

అదే స‌మ‌యంలో సిట్ స‌హా.ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విచార‌ణ క‌మిటీపై స్టే విధించింది.

అయితే, ఈ విష‌యంలో వైసీపీ కోరింది ఏంటంటే.రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భుత్వ వాద‌న‌ను హైకోర్టు పక్క‌న పెట్ట‌డం కాకుండా.

ప్ర‌భుత్వ వాద‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.బాగుండేద‌ని! రాజ‌ధాని భూముల విచార‌ణ‌లో ఏసీబీపై న‌మ్మ‌కం లేకుంటే.

కేంద్రాన్ని, సీబీఐని కూడా ఇంప్లీడ్ చేయాల‌ని స‌ర్కారు కోరింది.అయితే, స‌ర్కారు వేసిన ఈ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఇదే ఇప్పుడు వైసీపీ నేత‌ల బాధ‌.హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా.ఓకే.కానీ, మా వాద‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.క‌దా!! అనేదే!! మ‌రి ఆ ఆవేద‌న వైసీపీకి ఎప్పుడు తీరుతుందో ? చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube