వైకాపా అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడవబోతున్నారా? చంద్రబాబు గొప్ప వ్యక్తని, మహాత్ముడని భావించి ఆయన అడుగుజాడల్లో నడవడం కాదు.బాబు చేసిన ఒక పనే జగన్ కూడా చేయబోతున్నాట్ట….! ‘నువ్వెక్కడుంటే నేనక్కడంటా’ అనే పాట మాదిరిగా బాబు ఉన్న చోటనే తానూ ఉండాలని జగన్ అనుకుంటున్నారట….! ప్రస్తుతం బాబు హైదరాబాదు నుంచి తన మకాం పూర్తిగా విజయవాడకు మార్చారు.
పరిపాలన పూర్తిగా అక్కడి నుంచే సాగిస్తున్నారు.కుటుంబాన్ని కూడా తరలించారు.
దీంతో ముఖ్యమంత్రి విజయవాడలో ఉండగా, ప్రతిపక్ష నాయకుడైన జగన్ హైదరాబాదులో ఉన్నారు.ముఖ్యమంత్రి ఏ ఊళ్లో ఉంటే ప్రతిపక్ష నేత ఆ ఊళ్లోనే ఉంటే బాగుంటుందని, ఆయన ఉన్న చోటనే విమర్శలు చేయాలని జగన్ అనుకున్నాడేమో….! తాను కూడా విజయవాడకు మకాం మార్చేందుకు ఆలోచిస్తున్నాడట.చంద్రబాబు విజయవాడకు తరలిన తరువాత హైదరాబాదులో స్థిరంగా ఉన్న అనేకమంది టీడీపీ నేతలు కూడా విజయవాడలో ఇళ్లు తీసుకొని మారిపోయారు.
ఇప్పుడు జగన్ కూడా తాను ఊరు మారతానని, వైకాపా నాయకులు కూడా తరలిరావాలని చెబుతున్నారట.విజయవాడలోనే ఉంటే ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు.జిల్లాల్లో సులభంగా తిరగొచ్చు.ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
ఈ ఏడాది డిసెంబరు నాటికి జగన్ విజయవాడకు మారాలని అనుకుంటున్నారు.ఆయనకు ఓ మంచి ఇల్లు చూసేందుకు అక్కడి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
లేదా మంచి జాగా చూస్తే ఇల్లు కట్టుకోవచ్చు కూడా.చాలామంది నాయకులు విజయవాడకు తరలుతుండటంతో అది విఐపీల నగరంగా మారుతో్ంది.







