28న ఆంద్ర ప్రదేశ్ బంద్

ఆంద్ర ప్రదేశ్లో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రతీ పార్టీ ఆందోళన చేస్తోంది.

అధికార టీడీపీ, దాని మిత్ర పక్షమైన భాజపా తప్ప మిగిన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి.

ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ సందర్భంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో సోమవారం తిరుపతి బంద్ జరిగింది.ఇదే రోజు దిల్లీలో వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

ఇదే పార్టీ ఈ నెల (ఆగస్టు) 28న రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది.జగన్ దిల్లీలో బంద్ పిలుపునిచ్చారు.

ఆంద్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.ఆ సమావేశాల్లో టీడీపీని, భాజపాను కడిగి పారేస్తామని జగన్ చెప్పారు.

Advertisement

పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ పార్టీ జరగనీయకుండా అడ్డుకున్నట్లు అసెంబ్లీని కూడా అడ్డుకోవాలని వై కా పా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వై కా పా చాలా గొడవ చేసిన సంగతి తెలుసు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు